డయేరియాను నిర్మూలిస్తాం : డీఎంహెచ్‌వో

Sat,September 14, 2019 12:10 AM

మయూరి సెంటర్ : నవజాత శిశువుల నుంచి ఏడేళ్ల చిన్నారులకు రోటా వ్యాక్సిన్ ద్వారా డయేరియాను పూర్తిగా నిర్మూళించేందుకు కృషి చేస్తామని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ బీ కళావతిబాయి, ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బీ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం రోటా వ్యాక్సిన్‌ను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రారంభించిన అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. చిన్నపిల్లలో వచ్చే వ్యాధుల్లో డయేరియా ఒకటని, రోటా అనే వైరస్ కారణంతో పిల్లల్లో డయేరియా వ్యాప్తి చెందుతుందని, రోటా వ్యాక్సీన్ ద్వారా ఆ వైరస్‌ను అంతమొందించి చిన్నారుల ప్రాణాలు కాపాడేందుకే ఈ వ్యాక్సీన్ ఉపయోగపడుతుందన్నారు. జిల్లా ప్రధాన ప్రభుత్వ వైద్యశాలలో చిన్నారులకు మూడు డోసుల్లో 14 వారాలలోపు పిల్లలకు రోటావ్యాక్సీన్ అందుబాటులో ఉంటుందని వారు వెల్లడించారు. అదే విధంగా జ్వరపీడితులకు ఆరోగ్య సేవలందుతున్నాయని, జ్వరాలు తగ్గుముఖం పట్టాయాన్నారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ మాలతీ, ఆర్‌ఎంవో డాక్టర్ కృపాఉషశ్రీ, నిలోహన, డాక్టర్ కోటిరత్నం, వైద్యులు పాల్గొన్నారు.

81
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles