అజేయుడు..విజేయుడై

Fri,September 13, 2019 03:40 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ : ఘన చరిత్ర కలిగిన ఖమ్మం గడ్డపై మరో చరిత్ర ఆవిష్కృతమైంది. ఉద్దండులు ఏలిన నేలపై పసికూన పారాహుషార్ చేస్తుంది...అనుభవం లేదన్న నాలుకలకు సమాధా నం చేప్పే దిశగా స్వారీ చేయబోతున్నాడు. నిన్నటి వరకు ఒక చరిత్ర...నేటి నుంచి మరో చరిత్ర... ఇప్పటికే ఉమ్మడి ఖమ్మంలో టీఆర్‌ఎస్ ప్రభంజనం కొనసాగుతుండగా మున్ముందు మరింత ప్రభంజనంగా మారనుంది. అజేయుడు...విజేయుడై అడిగిడిన నేల పులకించింది. రాష్ట్రంలో ఉత్తర తెలంగాణతో పోల్చితే ఉమ్మడి ఖమ్మంలో టీఆర్‌ఎస్ బలం తక్కువే అయినప్పటికీ రాబోయే రోజుల్లో ఉత్తరానికి దీటుగా జిల్లా తయారు కాబోతుందనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్, యువనేత కేటీఆర్‌ల ఆశీస్సులతో రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా జిల్లాలో అడుగిడిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ రాకతో జిల్లా రాజకీయాలలో చర్చనీయాంశమైంది. రాజకీయాలలోకి ప్రవేశించి ఏడేండ్లు అవుతున్నా...పోటీ చేసిన రెండు ఎన్నికల్లోను అజేయుడిగా నిలిచి, ఉద్దండులు ఏలిన నేలపై యువకుడిగా అడుగుపెట్టడం రాజకీయ వర్గాలలో పెను సంచలనంగా మారింది. కేవలం ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవమే ఉన్నప్పటికీ అధినేత నిర్ణయాలను తూచాతప్పకుండా అమలు చేయడంతో పాటు తనను నమ్మిన ప్రజలకు నిత్యం తలలో నాలుకల ఉండ టం వలన పార్టీ, ప్రభుత్వ పెద్దలకు అజయ్ దగ్గరయ్యాడు. తన విశ్వసనీయతే పదవి వచ్చేలా చేసిం ది. ఓటమి ఎరుగని నేతగా ఎదుగుతున్న అజయ్‌కు మంత్రి పదవి లభించడం పట్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలకు అతీతంగా అజయ్‌ను ప్రజలు అభిమానిస్తున్నారు. ఎదిగిన కొద్ది ఒదిగి ఉండే మనస్తత్వం కలిగిన అజయ్ కుమార్ నడవడికను ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. సీఎం కేసీఆర్ అజయ్‌కు మంత్రి పదవి ఇచ్చి చాలా మంచి పనిచేశారు. సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలు భావిస్తున్నారు.

గులాబీ మయమైన ఖమ్మం...
రాష్ట్ర రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి జిల్లాలో తొలిసారిగా అడుగు పెట్టిన మంత్రి పువ్వాడ అజయ్‌కు ఘనస్వాగతం లభించింది. జిల్లాలోని ఖమ్మం, వైరా, మధిర, సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాలతో పాటు కొత్తగూడెం,ఇల్లెందు నియోజకవర్గాల నుంచి టీఆర్‌ఎస్ నాయకులు, శ్రేణులు అధిక సంఖ్యలో ఖమ్మం చేరుకు న్నారు. ముఖ్యంగా ఖమ్మం నగరంలోని 50 డివిజన్ల నుంచి ఆయా కార్పొ రేటర్ల నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు, మంత్రి అభిమానులు ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేసుకుని జిల్లా సరిహద్దు ప్రాంతమైన నాయ కన్‌గూడెం వద్దకు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకే అక్కడి రావాల్సిన మంత్రి గంట ఆలస్యంగా వచ్చినప్పటికి వేలాది మంది కార్యకర్తలు ఒపిగగా వేచి ఉండి మంత్రికి స్వాగతం పలికారు. అక్కడి నుంచి భారీ మోటర్ సైకిల్‌ను ఖమ్మం వరకు నిర్వహించారు. ఖమ్మం నగరంలోని వైరా రోడ్, కాల్వొడ్డు, బస్టాండ్ సెంటర్, మయూరిసెంటర్, ఇల్లెందు క్రాస్‌రోడ్, బైపాస్‌రోడ్, రోటరినగర్, గాంధీచౌక్ తదితర ప్రాంతాలన్ని మంత్రి అజయ్‌కు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో నిండిపోయాయి. నగరం మొత్తం ఫ్ల్లెక్సీల ప్రభంజనం కనిపించింది. పువ్వాడ రాకతో నగరంలోని రోడ్లన్ని కార్యకర్తలతో నిండిపోయాయి. గిరిజన, లంబాడి నృత్యాలతో కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు వద్ద మహిళా కార్యకర్తలు హారతిపట్టి స్వాగతించారు. ఓపెన్‌టాప్ జీపులో ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీని కొనసాగించారు.

అడుగడుగునా ఘన స్వాగతం..
మంత్రిగా ప్రమాణస్వీకారాం చేసిన తరువాత తొలిసారి ఖమ్మం జిల్లాకు వచ్చిన ఆయనకు జిల్లా ప్రజలు ఘన స్వాగతం పలికారు. జిల్లా సరిహద్దు అయిన నాయకన్‌గూడెం నుంచి ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియం వరకు ప్రజా ప్రతినిధులు, ప్రజలు మంత్రి పువ్వాడకు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. భారీ మోటర్ సైకిల్ ర్యాలీ, కార్ల ర్యాలీ నిర్వహించారు. గురువారం ఉదయం హైద్రాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాల సాని లక్ష్మీనారాయణలతో కలిసి మంత్రి జిల్లాకు వచ్చారు. నాయకన్‌గూడెం వద్ద మంత్రి పువ్వాడకు ఖమ్మం మేయర్ పాపాలాల్, కూసుమంచి ఎంపీపీ బానోత్ శ్రీనివాస్, ఖమ్మం రూరల్ ఎంపీపీ బెల్లం ఉమా, డిప్యూటీ మేయర్ బత్తుల మురళీ తదితరులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీలో కొనసాగారు. పాలేరు, కూసుమంచి గ్రామా లలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి, జీళ్లచెరువులోని మహాత్మగాంధీ విగ్రహానికి, తళ్లంపాడులోని అంబేద్కర్ విగ్రహాలకు మంత్రి పువ్వాడ పూలమాలలు వేశారు. అనంతరం ఖమ్మం నగరంలోకి ప్రవేశించగానే నగర కార్పొరేటర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. మహిళలు హారతితో స్వాగతం పలికారు. ఆ తరువాత ఖమ్మం నగరంలోని మయూరి సెంటర్‌లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అక్కడి నుంచి బస్టాండ్ మీదుగా జడ్పీసెంటర్‌కు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఆ తరువాత వైరారోడ్, ఇల్లెందుక్రాస్‌రోడ్ నుంచి బైపాస్ రోడ్డుకు చేరుకుని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సర్దార్‌పటేల్ స్టేడియంలోని బహిరంగ సభావేదికకు చేరుకున్నారు.

అమరవీరులను స్మరించుకున్న అజయ్...
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అమరవీరులను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్మరించుకున్నారు. ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్ వద్ద అమరవీరుల స్తూపం వద్ద వారికి నివాళులర్పించి వారి త్యాగాలను కొనియాడారు. వారి పోరాట ఫలితంగానే తెలంగాణ ఆవిర్భవించిందని చెప్పారు. వారి ప్రాణాల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో తాను మంత్రిగా పనిచేయడం గర్వంగా ఉందని, ప్రతి అమరవీరు కుటుంబాలను సీఎం కేసీఆర్ ఆదుకుంటారన్నారు. ఆ తరువాత బైపాస్‌రోడ్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి తనకున్న ప్రేమను చాటుకున్నారు.

అందరిని ఏకతాటిపై...
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీ ప్రభంజనం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు మెచ్చిన నాయకులు అనేక మంది గులాబీ గూటికి చేరారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజయ్‌కుమార్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అందరి నాయ కులను ఒకే వేదికపైకి తీసుకురావడంలో సఫలీకృతలయ్యారు. ప్రస్తుత ప్రజా ప్రతినిధులతో పాటు మాజీ ప్రజా ప్రతినిధులను, నాయకులను ఐక్యమ త్యంగా ముందుకు నడిపించే లక్ష్యంతో సభను నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల టీఆర్‌ఎస్ శాసనసభ్యులు సభకు హాజరయ్యారు. వీరిలో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి జిల్లా సరి హద్దు నాయికన్‌గూడెం నుంచి పెద్ద తండా వరకు మంత్రితో వచ్చి అత్యవసర పనినిమిత్తం హైద్రాబాద్ వెళ్లారు. ఆ నియోజకవర్గానికి చెందిన పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు మంత్రి పువ్వాడకు ఘనస్వాగతం పలికారు. మద్దినేని బేబి స్వర్ణకుమారి సభలో పాల్గొన్నారు. అదేవిధంగా వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్, మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ లుసభకు హాజరయ్యారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సతీమణి ఆసుపత్రిలో వైద్యం పొందుతుండగా ఆయన సభకు రాలేకపోయారు. ఆ నియోజకవర్గం నుంచి మట్టా దయానంద్, పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీ లు సభకు హాజరయ్యారు. మధిర నియోజకవర్గం నుంచి ఇప్పటికే ప్రాతి నిధ్యం వహిస్తున్న జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ సభకు అధ్యక్ష వహించగా ఆ నియోజకవర్గానికి చెందిన కొండబాల కోటేశ్వరరావు, బొమ్మెర రామ్మూర్తిలు హాజరయ్యారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, వనమా రాఘవ, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

210
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles