మంత్రి పువ్వాడ అజయ్‌కు ఎంపీ నామా అల్పాహార విందు

Fri,September 13, 2019 03:39 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నాయకులు, ఖమ్మం టీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో గురువారం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కి అల్పాహార విందు ఏర్పాటు చేశారు. మంత్రి పువ్వాడ అజయ్‌తో పాటూ జూబ్లీహిల్స్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరి ప్రియ నాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవితో పాటూ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ని నామా నాగేశ్వరరావు శాలువ కప్పి ఘనంగా సత్కరించారు. ఖమ్మం జిల్లా శాసన సభ్యునికి మంత్రిగా అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కి నాయకులు నామా నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలలో టీఆర్‌ఎస్ పార్టీ సన్నద్ధం పై అల్పాహార విందు సందర్భంగా నేతల మధ్య చర్చ జరిగింది.

174
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles