మంత్రి పువ్వాడ అజయ్..

Thu,September 12, 2019 12:27 AM

-మంత్రి హోదాలో తొలిసారి రాక..
-నాయకన్‌గూడెం వద్ద ఘనస్వాగతం..అనంతరం భారీ ర్యాలీ..
-సర్దార్‌పటేల్ స్టేడియంలో బహిరంగ సభ..
-భారీగా ఏర్పాట్లు చేసిన టీఆర్‌ఎస్ శ్రేణులు

మామిళ్లగూడెం, సెప్టెంబర్ 11 : తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా జిల్లా పర్యటనకు వస్తున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు టీఆర్‌ఎస్ శ్రేణులు పూర్తి చేశారు. బుధవారం సర్థార్ పటేల్ స్టేడియంలో ఏర్పాట్లను టీఆర్‌ఎస్ నగర అధ్యక్షులు, కార్పొరేటర్ కమర్తపు మురళి, డిప్యూటీ మేయర్ బత్తుల మురళీ ప్రసాద్‌రావు. కార్పొరేటర్లు పగడాల నాగరాజు, నారాయణరావు, బచ్చు విజయ్‌కుమార్ తదితరులు పరిశీలించారు. బహిరంగ సభ, భద్రతా ఏర్పాట్లను నగర ఏసీసీ గంటా వెంకట్రావు పరిశీలించారు. మంత్రి పర్యటనకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి జన సమీకరణ చేయడంతో పాటు జిల్లా సరిహద్దు నాయకన్‌గూడెం నుంచి భారీ స్వాగతం పలికేందుకు టీఆర్‌ఎస్ నేతలు సర్వం సిద్ధం చేశారు.

స్వాగతం పలికిన తరువాత అక్కడ నుంచి భారీ ద్విచక్ర, ఇతర వాహనాలతో ర్యాలీ నిర్వహించనున్నారు. ఖమ్మం నగరానికి చేరుకున్న తరువాత కాల్వోడ్డు నయాబజార్ సెంటర్ నుంచి సర్థార్ పటేల్ స్టేడియం వరకు భారీ ర్యాలీ చేపట్టనున్నారు. అనంతరం స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి పాల్గొనున్నారు. మంత్రి తుమ్మలతో పాటూ ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు హైదరాబాద్ నుంచి రానున్నారు. తొలి సారి ఖమ్మం పర్యటనకు వస్తున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు స్వాగతం పలుకుతూ నగరంలో అన్ని ప్రధాన కూడల్లలో అభిమానులు, టీఆర్‌ఎస్ శ్రేణులు పెద్దఎత్తున బ్యానర్లు, ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.

నేడు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పర్యటన
తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ జిల్లాలో రెండు రోజులు పర్యటించనున్నట్లు మంత్రి ఓఎస్‌డీ ఎస్.కృష్ణకాంత్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం 12వ తేదీ ఉదయం 7గంటలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ మంత్రి నివాసం నుంచి రోడ్డుమార్గంలో వయా సూర్యాపేట నుంచి ఖమ్మం జిల్లాకు రానున్నట్లు తెలిపారు. ఉదయం10 గంటలకు ఖమ్మం జిల్లా సరిహద్దు గ్రామం నాయకన్‌గూడెం వద్దకు చేరుకొని పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొంటారు. ఉదయం 11గంటలకు ఖమ్మం నగరంలోని సర్థార్ పటేల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.

13వ తేదీన ఉదయం 9:45కి మంత్రి నివాసం నుంచి బయలు దేరి 10గంటలకు ఖమ్మం నగరంలోని ఎన్‌ఎస్‌పీ క్యాంపులో నూతనంగా నిర్మాణం చేసిన జిల్లా పంచాయతీ రిసోర్స్ సెంటర్ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. 14వతేదీ ఉదయం 6 గంటలకు బయలుదేరి 10:30 గంటల వరకు హైదరాబాద్ చేరుకుని శాసనసభ కార్యక్రమాలకు హాజరుకానున్నట్లు వివరించారు.

242
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles