ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు...

Thu,September 12, 2019 12:19 AM

-ఖమ్మం నగరంలో పలు మెడికల్ షాపులపై డ్రగ్ నియంత్రణ అధికారుల తనిఖీలు
మయూరిసెంటర్, సెప్టెంబర్ 11: ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించిన మెడికల్‌షాపుల నిర్వాహకులపై చర్యలు తప్పవని ఔషధ నియంత్రణ పరిపాలన విభాగ ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ అసిస్టెంట్ డైరెక్టర్ గంగిడి శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఖమ్మం నగరంలోని వైరా రోడ్ ప్రాంతంలోగల ప్రవేట్ వైద్యశాలలకు అనుబంధంగా వున్న మెడికల్ షాపులపై తనిఖీలు నిర్హహించిన అనంతరం నమస్తే తెలంగాణతో ఆయన మాట్లాడారు. సాధారణ తణిఖీలలో భాగంగా తమ డ్రగ్ ఇన్స్‌స్పెక్టర్లతో కలిసి ఈ తణిఖీలు నిర్వహించడం జరిగిందని, వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రబలుతున్న సీజనల్ వ్యాధులు, విష జ్వరాలతో బాధపడుతున్న వారి వద్దనుంచి నగరంలోని కొన్ని ప్రైవేట్ వైద్యశాలలకు
అనుబంధంగా వున్న మెడికల్‌షాపుల నిర్వాహకులు మందులను ఎమ్మార్పీ ధరల కంటే అధికంగా విక్రయిస్తున్నారనే సమాచారం రావడంతో తణిఖీలు చేపట్టడం జరిగిందని ఆయన చెప్పారు.అయితే బుధవారం నగరంలోని వైరా రోడ్‌లో గల ప్రైవేట్ వైద్యశాలలు స్వాతి, సుజాత, ఏషియన్, సూర్య ఆర్థోపెడిక్, ఉషోదయ, అభయలకు అనుబంధంగా ఉన్న మెడికల్‌షాపులలో గల బిల్స్, ఎమ్మార్పీ ధరలకనుగుణంగా విక్రయాలు జరుగుతన్నాయా లేదా అనే అంశాలను పరిశీలించామని, కొన్ని షాంపిల్స్ సేకరించినట్లు తెలిపారు. తణిఖీలలో భాగంగా మెడికల్ షాపుల సీజ్ జరుగలేదన్నారు. ఈ తణిఖీ నిర్హహనలో జిల్లాకు చెందిన డ్రగ్ ఇన్స్‌పెక్టర్లు సురేందర్, సోమేశ్వర్, వరంగల్‌కు చెందిన డీఐ రవికిరణ్, కొత్తగూడెంకు చెందిన డీఐ కిరణ్‌కుమార్, సీనియర్ అసిస్టెంట్ వేణు తదితరులు పాల్గొన్నారు.

194
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles