డెంగ్యూతో వ్యక్తి మృతి..

Thu,September 12, 2019 12:18 AM

ముదిగొండ, సెప్టెంబర్ 11: మండల పరిధిలోని వనంవారి క్రిష్ణాపురం గ్రామానికి చెందిన ముడుసు వెంకటేశ్ (36) అనే యువకుడు డెంగ్యూ వ్యాధి కారణంగా మృతి చెందాడు. వెంకటేష్‌కు మూడు రోజుల క్రితం జ్వరం రావటంతో చికిత్స కోసం ఖమ్మం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. పరీక్షల్లో రోజు రోజుకు ప్లేట్‌లెట్స్ పడిపోవటంతో పాటు కామెర్లు కూడా సోకాయి. మంగళవారం సాయంత్రం వైద పరీక్షలు నిర్వహించగా 20 వేల లోపు ప్లేట్‌లేట్స్ పడిపోవటంతో మెరుగైన వైద్యం కోసం బుధవారం ఉదయం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గం మధ్యలో మృత్యువాత పడ్డాడు. కాగా మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అకస్మాత్తుగా డెంగ్యూ వ్యాధి కారణంగా వెంకటేశ్ మృతి చెందటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వెంకటేశ్ మృతి చెందిన విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ తుపాకుల రమాదేవి, మాజీ సర్పంచ్ తుపాకుల ఎలగొండస్వామి మృతదేహాన్ని సందర్శించి నివాళ్లర్పించి కుంటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు.

వైరాలో...
వైరా నమస్తేతెలంగాణ, సెప్టెంబర్11: వైరాలోని శాంతినగర్ ఎస్సీకాలనీకి చెందిన కొమ్ము కృష్ణ (55) డెంగ్యూ జ్వరంతో బుధవారం మృతి చెందాడు. కృష్ణ గత నాలుగు రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ.. ఖమ్మంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బుధవారం ఆయన ఆసుపత్రిలో మృతి చెందాడు. మృతుడికి భార్య రాదమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. డెంగ్యూ జ్వరంతో కృష్ణ మృతి చెందడంతో శాంతినగర్ ఎస్సీ కాలనీ వాసులు భయాందోళన చెందుతున్నారు. తమ కాలనీలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

216
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles