ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో అదనపు ఏర్పాట్లు

Wed,September 11, 2019 02:01 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ : సీజనల్‌ వ్యాధులు ప్రభలకుడం వల్ల జిల్లా ప్రధాన ఆసుపత్రికి ఇన్‌పేషంట్ల సంఖ్య పెరుగుతున్నందున అదనంగా మరో రెండు పడకలను తక్షణమే ఏర్పాటు చేసి ఇతర వార్డులకు పేషంట్లను మార్చాలని వైద్యాధికారులను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశించారు. మంగళవారం ఖమ్మం పర్యటనకు వచ్చిన మంత్రి, ముందుగా జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో వైరల్‌ జ్వరాలతో బాధపడుతున్న పేషంట్ల వార్డును సందర్శించి రోగులతో మాట్లాడారు. జిల్లా ఆసుపత్రిలోని బ్లడ్‌బ్యాంక్‌, ట్రామాకేర్‌ సెంటర్‌ను పరిశీలించారు. అనంతరం, కలెక్టరేట్‌ ప్రజ్ఞా సమావేశ మందిరంలో ఖమ్మం పార్లమెంట్‌ సభ్యులు నామా నాగేశ్వరరావు, జిల్లాపరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌తో కలిసి వైద్యాధికారులతో సీజనల్‌ వ్యాధులపై సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ.. 400 పడకల సామర్థ్యం గల ఖమ్మం ఆస్పత్రిలో వైద్యులు విశేష సేవలు అందిస్తున్నట్లు తెలుస్తున్నదని అన్నారు.

ఈ మధ్యకాలంలో జిల్లాలో వచ్చిన వైరల్‌ ఫీవర్స్‌ విఫరీతంగా రావడం వల్ల 400 పడకల సామర్థ్యం ఉన్న ఈ వైద్యశాలలో 675 మంది ఫేషెంట్లకు ట్రీట్‌మెంట్‌ జరుగుతుందన్నారు. ప్రతి రోజు 1100ల ఓపీ నుంచి 1500ల వరకు ఓపి సేవలు పెరిగాయని, ఇక్కడ ఉన్నటువంటి ఈ హస్పిటల్‌ సామర్థ్యానికి మించి 50- 60 శాతం పేషేంట్లు అధికంగా ఉన్నారన్నారు. ఇక్కడ ఎమర్జెన్సీ, ట్రామాకేర్‌ సెంటర్‌ ఒకటి నిర్మాణమై ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉన్న ఈ భవనంలో జ్వర పీడితుల సంఖ్య గణనీయంగా పెరగడంతో వారికి సేవలందించేందుకు తాత్కాలికంగా ఈ భవనంలో గల వార్డులు కూడా ఉపయోగించుకుని ఇంధక 150 నుంచి 200 ల బెడ్స్‌ను కూడా ఈ సీజన్‌ కోసం ఏర్పాటు చేసుకోవాల్సిందిగా బావిస్తున్నామన్నారు. సిబ్బందిని పెంచుకునేందుకు కలెక్టర్‌కు అనుమతి ఇస్తున్నామన్నారు. ఖమ్మం, కరీంనగర్‌, మంచిర్యాలలో మూడు మెడికల్‌ కాలేజీలు కావాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు చెప్పారు. రాబోయే కాలంలో ఖమ్మంలో ఆధునిక వైద్య సదుపాయాలు మరింతగా పేషేంట్లుకు అందుబాటులో ఉండే పద్దతిలో బిల్డింగ్‌ సామర్థ్యం, మ్యాన్‌ పవర్‌ను పెంచుకుని ఈ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలో అందుతున్న సేవలను పెంచుతామన్నారు. ప్రజలకు ఈ సీజన్‌లో 98,99 శాతం వైరల్‌ ఫీవర్స్‌ మాత్రమే...డెంగ్యూ జ్వరాలు కూడా 2017లో వచ్చిన తీవ్రత ఇప్పుడు వచ్చే జ్వరాలలో ఆ తీవ్రత లేదన్నారు. దాదాపుగా జ్వరపీడితుడికి మెరుగైన వైద్యసేవలు అందుతున్న నేపథ్యంలో జ్వరాలు అదుపులోకి వచ్చాయన్నారు. ఇక్కడ డయాలసిస్‌ సెంటర్‌లు కాని, కార్డియాలజీ సెంటర్‌ను ప్రారంభించే ప్రయత్నం కూడా చేస్తున్నామన్నారు. ఒక మాటలో చెప్పాలంటే టెరిసరి కేర్‌ హస్పిటల్స్‌లో ఏ సౌకర్యాలు ఉన్నాయో, మెడికల్‌ కాలేజికి ఏ సౌకర్యాలైతే ఉన్నాయో ఆ సౌకర్యాలను ఖమ్మం హస్పిటల్‌కు కల్పించే ప్రయత్నం చేస్తామన్నారు. కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ మాట్లాడుతూ.. జిల్లాలో విషజ్వరాల నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. డెంగ్యూ జ్వరాలను నియంత్రించేందుకు ప్రైవేట్‌ ఆసుపత్రులలోని రోగుల కేసులను కూడా జిల్లా ప్రధాన ఆసుపత్రులలో మాత్రమే నిర్థారణ పరీక్షలు నిర్వహించేలా ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆదేశించామన్నారు.

రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాస్‌ మాట్లాడుతూ............. ఖమ్మం జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యసేవలు జిల్లా కలెక్టర్‌ వారి సారధ్యంలో సమర్థవంతంగా అందిస్తున్నారని, గత నాలుగు సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం జిల్లాలో డెంగ్యూ కేసుల సంఖ్య తగ్గిందని అన్నారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలోని బ్లడ్‌బ్యాంక్‌ ద్వారా అవసరమైన అవసరాలు తీరుతున్నాయని వివరించారు. సమావేశంలో రాష్ట్ర వైద్యవిధాన పరిషత్‌ డిప్యూటీ కమిషనర్‌ జయరామిరెడ్డి, ప్రత్యేక అధికారి డాక్టర్‌ రాజశేఖర్‌బాబు, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హన్మంతు కొడింబా, శిక్షణ కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, మలేరియా అధికారి సైదులు, టీబీ నియంత్రణ అధికారి సుబ్బారావు, డీఎంహెచ్‌వో డాక్టర్‌ కళావతిబాయి, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర వెంకటేశ్వర్లు, డిప్యూటీ మేయర్‌ బత్తుల మురళీ ప్రసాద్‌, కార్పొరేటర్లు కమర్తపు మురళి, పగడాల నాగరాజు, జిల్లా ప్రధాన ప్రభుత్వ అసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు పాల్గొన్నారు.

186
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles