బీటీపీఎస్‌ పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు

Wed,September 11, 2019 02:00 AM

మణుగూరు, నమస్తేతెలంగాణ : రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మణుగూరు-పినపాక మండలాల్లో నిర్మిస్తున్న 1080(4X270)మెగావాట్ల సామర్థ్యంగల భద్రాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంటు(బీటీపీఎస్‌) నిర్మాణ పనులు త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని, ఈనెల 13,14 తేదీల్లో యూనిట్‌-1 సింకర్నైజేషన్‌ చేయనున్నట్లు టీఎస్‌జెన్కో డైరెక్టర్‌ (ప్రాజెక్టు)యం. సచ్చితానదం. జెన్కో డైరెక్టర్‌ (సివిల్‌) ఎ.అజయ్‌ అన్నారు. మంగళవారం వారు తొలుత టీటీపీఎస్‌ను సందర్శించి అన్ని రకాల పనులను పరిశీలించారు. అనంతరం జెన్కో కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. అన్నిరకాల పనులు షెడ్యూల్‌ ప్రకారం వేగవంతంగా జరుగుతున్నాయని, మరింత వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే యూనిట్‌-1లో సింకర్నైజేషన్‌ కోసం స్టీమ్‌ డంపింగ్‌ పనులు ప్రారంభించామన్నారు. ఈ స్టీమ్‌ క్వాలిటీ వచ్చే వరకు డంపింగ్‌ పనుల జరుగుతాయని, పూర్తి కాగానే వెంటనే సింకర్నైజేషన్‌ చేస్తామన్నారు. త్వరగా 2, 3 యూనిట్లలో లైటప్‌ చేసేందుకు పనులను పూర్తి చేస్తున్నామన్నారు. తొలుత యూనిట్‌-1లో ఆయిల్‌ద్వారా ఈ నెల 13,14 తేదీల్లో సింకర్నైజేషన్‌ చేసి ఆ వెంటనే కోల్‌ ద్వారా నిర్వహిస్తామన్నారు. మణుగూరు ఏరియా పీకేఓసీ-4, మణుగూరు ఓసీ(మల్లెపల్లి)నుంచి రోడ్డు మార్గం ద్వారా కోల్‌ ట్రాన్స్‌ పోర్టుకు ఎంఈవోఎఫ్‌ అనుమతులు వచ్చాయిని, మణుగూరు ఏరియా నుంచి వచ్చే నెల మొదటి వారం నుంచి కోల్‌ ట్రాన్స్‌పోర్టు చేసుకుంటమన్నారు. ఈ నెల చివరి కల్లా యూనిట్‌-2లో, వచ్చే నెల యూనిట్‌-3లో లైటప్‌ చేసేందకు పనులు వేగంగా చేస్తున్నారని తెలిపారు. యూనిట్‌-4లో వచ్చే నెలలో హైడ్రాలిక్‌ టెస్టు నిర్వహించేలా పనులు చేస్తున్నామని, అన్ని ఏజెన్సీల నిర్వాహకులు అవసరమైన మ్యాన్‌పవర్‌ పెంచి పనులను వేగంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బీటీపీఎస్‌లో పని చేసే ఇంజినీర్లకు, జేపీఏలు, ఇతర సిబ్బంది కోసం సుమారు 850 క్వార్టర్లు నిర్మాణమవుతున్నాయి, ఇప్పటికే ప్రతి పాదనలు తయారు చేసి పంపామన్నారు. తొలుత ప్లాంట్‌ ఆవరణంలో రైల్వేట్రాక్‌ నిర్మాణ పనులకు ఈ నెల టెండర్లు ఆహ్వానించనున్నట్లు వారు తెలిపారు. సమావేశంలో బీటీపీఎస్‌ సీఈ పిల్లి బాలరాజు, సీఈ(టీపీసీ) పీవీ శ్రీనితాసరావు పాల్గొన్నారు.

185
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles