మంత్రి ఈటలకు పొంగులేటి ఘన స్వాగతం

Wed,September 11, 2019 02:00 AM

-ఈటల తొలి పర్యటన సందర్భంగా శాలువాతో సత్కారం..
ఖమ్మం,నమస్తే తెలంగాణ : ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం ఖమ్మం వచ్చిన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఖమ్మంలోని తన క్యాంప్‌ కార్యాలయంలో మెమొంటోతో సత్కరించి అభినందించారు. అనంతరం కొద్ది సేపు జిల్లాలో విషజ్వరాలు, ప్రజల ఆరోగ్య పరిస్థితులు, తలసేమియా, ఇతర అంశాలపై చర్చించారు. ఉమ్మడి జిల్లాలో ప్రజల ఆరోగ్య పరిస్థితులు మెరుగ్గా ఉండేందుకు ఆసుపత్రుల్లో తీసుకోవాల్సిన చర్యలపై పొంగులేటి సలహాలు, సూచనలు చేశారు. ఈటల, పొంగులేటిలతో పాటు ఎంపీ నామా నాగేశ్వరరావు, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్‌రెడ్డి, మేయర్‌ పాపాలాల్‌, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, బొమ్మెర రామ్మూర్తి, తుళ్లూరు బ్రహ్మయ్య, జడ్పీటీసీ సభ్యులు పోట్ల కవిత, తిరుపతి కిషోర్‌, చెక్కిలాల మోహనరావు, ఎంపీపీ గోసు మధు, నిరంజన్‌రెడ్డి, ఆకుల మూర్తి, వెంకటకృష్ణ, గుమ్మా రోశయ్య, పోట్ల శ్రీనివాస్‌, సుతగాని జైపాల్‌, కిలారు మనోహర్‌, సూర్యప్రకాష్‌, కార్పొరేటర్లు దోరేపల్లి శ్వేత, చేతుల నాగేశ్వరరావు, జంగం భాస్కర్‌, కొప్పెర ఉపేందర్‌, వడ్డెబోయిన శ్రీనివాస్‌ ఉన్నారు.

220
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles