బొకేలు, స్వీట్లు వద్దు.. నోట్‌ బుక్స్‌ తెండి..

Wed,September 11, 2019 01:58 AM

-మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌
ఖమ్మం, నమస్తే తెలంగాణ: రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఈ నెల 12వ తేదీన ఖమ్మం వస్తున్న సందర్భంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తనను కలవడానికి వస్తే స్వీట్లు, బొకేలు, పూలమాలలు శాలువలు తీసుకుని రావద్దని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకుని వస్తున్న తరుణంలో స్వీట్లు, శాలువలు, బొకేలు, పూలదండలు తీసుకురావొద్దని వాటి స్థానంలో నోట్‌ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు తీసుకురావాలన్నారు. వాటిని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందజేయనున్నట్లు తెలిపారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు గమనించి నోట్‌పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు మాత్రమే తీసుకురావాలని కోరారు.
మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావును కలిసిన మంత్రి అజయ్‌..
మయూరి సెంటర్‌, సెప్టెంబర్‌ 10: రాష్ట్ర రవాణాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పువ్వాడ అజయ్‌కుమార్‌ మంగళవారం హైదరాబాద్‌లోని కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జలగం వెంకట్రావు మంత్రి అజయ్‌కుమార్‌కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు
మంత్రి అజయ్‌కుమార్‌కు శుభాకాంక్షలు..
మయూరి సెంటర్‌ : రాష్ట్ర రవాణాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పువ్వాడ అజయ్‌కుమార్‌కు టీఆర్‌ఎస్‌ నేత వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) నేతృత్వంలో ది ఖమ్మం గ్రానైట్‌ స్లాబ్‌ ఫ్యాక్టరీ ఓనర్స్‌ అసోసియేషన్‌ నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లో గజమాలను బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో అసోసియేషన్‌ సభ్యులు రాయల నాగేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షులు సాదు రమేష్‌రెడ్డి, మాజీ అధ్యక్షులు పాటిబండ్ల యుగంధర్‌, రాష్ట్ర కోశాధికారి తమ్మినేని వెంకట్రావు, అధ్యక్షులు దిగుమర్తి పణికుమార్‌, ప్రధాన కార్యదర్శి కేఎస్‌పీ ముఖర్జీ (మల్లి), ఉపాధ్యక్షుడు పుచ్చకాయల మాధవరావు, సహాయకార్యదర్శి గరికపాటి రఘునందన్‌రెడ్డి, సహాయ కార్యదర్శి తమ్మినేని నవీన్‌, ఈసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

159
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles