12న జిల్లాకు రానున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

Tue,September 10, 2019 12:03 AM

మామిళ్లగూడెం : రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ 12న జిల్లా పర్యటనకు రానున్నట్లు వ్యక్తిగత సహాయకులు కిరణ్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా ఖమ్మం వస్తున్నారని పేర్కొన్నారు. గురువారం ఉదయం 10:30 గంటలకు నగరంలోని నగరంలోని నయాబజార్ కళాశాల నుంచి సర్ధార్ పటేల్ స్టేడియం వరకు భారీ ర్యాలీ ఉంటుందని తెలిపారు. అనంతరం బహిరంగ సభ జరుగుతుందన్నారు. మంత్రి అజయ్‌కి భారీ స్వాగతం పలికేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులు, పెద్ద ఎత్తున తరలిరానున్నారు. అదేవిధంగా మంత్రిగా బాధ్యతలు తీసుకున్న అజయ్‌కుమార్‌కు సోమవారం రాష్ట్ర శాసన సభ ఆవరణంలో చాంబర్ కేటాయించారు. మంత్రి పువ్వాడకు బస్ భవన్ ఓఎస్‌డీ కృష్ణకాంత్ స్వాగతం పలికారు.

199
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles