జలశక్తి అభియాన్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి..

Tue,September 10, 2019 12:03 AM

-ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్
రఘునాథపాలెం, సెప్టెంబర్ 9: జలశక్తి అభియాన్ పనులను నిర్ధేశించిన గడువులోగా యుద్ధప్రాతినిధికన పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ అధికారులకు ఆదేశించారు. మండల కేంద్రంతో పాటు మంచుకొండ, బూడిదంపాడు, గణేశ్వరం, గ్రామాల్లో జరుగుతున్న జలశక్తి అభియాన్ పనులను ఆయన సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. మంచుకొండలో జరుగుతున్న నీటి నిల్వ కందకాల పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలన్నారు. అనంతరం బూడిదంపాడులో చేపడుతున్న ఫారం పాండ్ పనులు తనిఖీ చేశారు. గణేశ్వరం గ్రామంలో బోర్‌వెల్ రీచార్జ్ పనులను, రఘునాథపాలెంలో ఇంకుడు గుంతల నిర్మాణ పనులను పర్యవేక్షించారు. భూగర్భ జలాలను పెంపొందించుకునేందుకు జలశక్తి అభియాన్ పథకంలో భాగంగా చేపట్టే నీటి నిల్వ కందకాలు, ఫారంఫాండ్‌ల ఏర్పాటు, బోరు బావుల పునరుద్ధరణ, ఇంకుడు గుంతల పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. అంతేకాక గ్రామాల్లో వివరివిగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బీ ఇందుమంతి, ఏపీడీ అశోక్, రఘునాథపాలెం తహసీల్దార్ కేవీ శ్రీనివాసరావు, ఎంపీడీవో సాయిచరణ్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు షేక్ మీరా, వాంకుడోతు విజయ, గుడిపూడి శారద, యాసా నీలిమ, ఏపీవో అమ్మాజాన్, ఫీల్డ్ అసిస్టెంట్‌లు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

గ్రామ రూపురేఖలు మారాలి : కలెక్టర్
కామేపల్లి, సెప్టెంబర్ 9: గ్రామాల్లో అభివృద్ధి కోసం అధికారులు,ప్రజాప్రతినిధులు, ప్రజలు కలిసి ప్రణాళికలు తయారు చేసుకోవాలని, 30 రోజుల గ్రామ ప్రణాళికతో గ్రామాల రూపురేఖలు మారాలని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ అన్నారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సోమవారం మండల పరిధిలోని జగన్నాథతండను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయడంతో పాటు అధికారులు, పాలకవర్గ సభ్యులు కృత నిశ్చయంతో పనిచేయాలన్నారు. గ్రామ ప్రణాళికలో అధికారులు విధిగా పనిచేయాలని నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అనంతరం గ్రామంలోని పలు వీధుల్లోని పరిసరాలను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ అజ్మీర శౌరి, గ్రామ స్పెషల్ అధికారి బావ్‌సింగ్, విద్యుత్‌శాఖ ఏఈ నారయణ, స్టాండింగ్ కమిటీ సభ్యులు ఉన్నారు.

195
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles