ప్రజలకు రక్షణ కల్పించడమే పోలీసుల కర్తవ్యం

Tue,September 10, 2019 12:02 AM

కామేపల్లి, సెప్టెంబర్ 9: నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని సీపీ తఫ్సీర్ ఇక్భాల్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని ముచ్చర్లలో గ్రామస్తుల సహకారంతో సుమారు రూ.3 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 22 సీసీ కెమెరాలను అడిషినల్ డీసీపీ మురళీధర్‌తో కలిసి సీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు రక్షణ కల్పించడమే పోలీసుల కర్తవ్యమన్నారు. నేను సైతం కార్యక్రమం ద్వారా గ్రామాల్లోని ప్రజలను చైతన్యపరిచి ప్రధాన సెంటర్లల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోనేలా చొరవ తీసుకుంటున్నామని తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి జిల్లాలోనే ముచ్చర్ల ఆదర్శంగా నిలిచిందన్నారు.

గ్రామాల్లో శాంతియుత వాతావరణం కల్పించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు.

వాహనదారులు నిబంధనలు పాటించాలన్నారు. ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హైల్మెట్ వాడాలని, మద్యం తాగి వాహనాలను నడపవద్దన్నారు. ప్రతీ వాహనాలకు సంబంధించిన పత్రాలు వెంట ఉంచుకోవాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు అందించిన సహాయం మరువలేనిదని ఎస్సై తిరుపతిరెడ్డి అన్నారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటునకు కృషి చేసిన ఎస్సై తిరుపతిరెడ్డిని సీపీ అభినందించి శాలువతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఖమ్మం రూరల్ ఏసీపీ రామోజీ రమేష్, సీఐ శ్రీనివాసులు, కామేపల్లి ఎస్సై తిరుపతిరెడ్డి, శిక్షణ ఎస్సై కొండల్‌రావు, కారేపల్లి ఎస్సై వెంకన్న, సర్పంచ్ జాటోత్ జాయ్‌లూసీ, జడ్పీటీసీ బాణోత్ వెంకటప్రవీణ్‌కుమార్, ఎంపీటీసీ గుగులోత్ గబ్రూనాయక్, ఉపసర్పంచ్ సిరిపురపు వెంకట్రావ్, కొమ్మినేని శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ తీర్థాల చిదంబరంగ్రామస్తులు ఉన్నారు.

152
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles