అభివృద్ధికి పాటుపడాలి..

Sun,August 25, 2019 12:25 AM

-జడ్పీటీసీగా బాధ్యతలు చేపట్టిన మాలోతు ప్రియాంక
-ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అజయ్ కుమార్

రఘునాథపాలెం, ఆగస్టు 24: రఘునాథపాలెం జడ్పీటీసీగా మండల సమగ్రాభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు. ఇటివల మండల జడ్పీటీసీగా ప్రమాణ స్వీకారం చేసిన మాలోతు ప్రియాంక శనివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. దీనికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ఎంపీడీవో శ్రీనివాసరావు చేత జడ్పీటీసీకి బాధ్యతలను అప్పగించారు. నూతన జడ్పీటీసీగా బాధ్యతలు చేపట్టిన మాలోతు ప్రియాంకకు ఎమ్మెల్యే పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. మండల ప్రజాప్రతినిధిగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఎంతో నమ్మకంతో జడ్పీటీగా గెలిపించిన ప్రజల నమ్మకానికి అనుగుణంగా పని చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధిగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో శక్తివంచన లేకుండా పనిచేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నారన్నారు. ఇందుకోసం 60రోజుల ప్రణాళికను సిద్ధం చేస్తున్నారన్నారు.

ఇందులో ప్రజాప్రతినిధులందరూ భాగస్వాములు కావాలన్నారు. ఇటివల ముగిసిన పంచాయతీ, పరిషత్ ఎన్నికల ద్వారా రఘునాథపాలెం మండలంలో టీఆర్‌ఎస్ పార్టీకి తిరుగులేదనే విషయాన్ని స్పష్టం చేయడం జరిగిందన్నారు. ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జడ్పీటీసీ పదవులను టీఆర్‌ఎస్ పార్టీనే కైవసం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మద్దినేని వెంకటరమణ, మాజీ జడ్పీటీసీ అజ్మీరా వీరూనాయక్, ఎంపీపీ భుక్యా గౌరి, వైస్ ఎంపీపీ గుత్తా రవికుమార్, ఏఎంవీ మాజీ వైస్ చైర్మన్ మందడపు నర్సింహరావు, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు మందడపు సుదాకర్, ఏఎంసీ డైరెక్టర్లు పొట్లపల్లి రాజా, బానోతు ప్రమీల, కాపా భూచక్రం, వేపకుంట్ల సర్పంచ్ ధారా శ్యాం, టీఆర్‌ఎస్ మండల బీసీ సెల్ అధ్యక్షుడు గొర్రె శ్రీనివాసరావు, కోటపాడు ఉపసర్పంచ్ కొంటెముక్కల వెంకటేశ్వర్లు, లక్‌పతి నాయక్, తొలుపూరి దానయ్య, మాళోతు రమేష్, జంగాల శ్రీను, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, టీఆర్‌ఎస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

149
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles