రామయ్యకు అష్టోత్తర శత కలశాభిషేకం

Mon,August 12, 2019 11:42 PM

-భక్తిశ్రద్ధలతో పవిత్రారోపణ పూజలు
భద్రాచలం, నమస్తే తెలంగాణ: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాల్లో భాగంగా సోమవారం రామాలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం, పవిత్రారోపణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. తొమ్మిది రకాల పండ్ల రసాలు, హరిద్రాచూర్ణాలు, సప్తనదీ తీర్థాలు, గందోధకాలు, కుంభ, ధ్వజ, అష్ట, ద్వాదశ హారతులు, తులసీ మాలలు, సహస్రధారలు, పంచ ఉపనిషత్తు మంత్రాలతో అర్చకులు కనుల పండువగా వేడుక నిర్వహించారు. అంతరాలయంలో మూలమూర్తులకు మహాకుంభప్రోక్షణ చేపట్టారు. యాగశాలలో అభిషేకం నిర్వహించారు. శ్రీరంగం నుంచి తీసుకొచ్చిన పవిత్రాలను బేడా మండపంలో ఉంచి మూలమూర్తులకు, ఉత్సవ మూర్తులకు లక్ష్మీతాయారు సన్నిధిలో, అభయాంజనేయస్వామి వారి ఆలయంలో, చుట్టు పరివార దేవతలకు పవిత్రములు వేసి పవిత్రారోపణ పూజలు నిర్వహించారు.

149
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles