పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి

Sun,May 19, 2019 12:38 AM

వైరా, నమస్తే తెలంగాణ: రైతులు సాగు చేస్తున్న సుబాబుల్, జామాయిల్ పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని సుబాబుల్, జామాయిల్ రైతు సం ఘం జిల్లా అధ్యక్షుడు ఏకే రామారావు అన్నారు. వైరాలోని మధు విద్యాలయంలో సుబాబుల్, జామాయిల్ రైతు సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో రామారావు రైతులు పండించిన సుబాబుల్, జామాయిల్ పంటలకు టన్నుకు రూ.6వేల నుంచి రూ.7వేల ధరను ఐపీసీ చెల్లించాలని కోరారు. అదేవిధంగా సుబాబుల్, జామాయిల్ పంటలను పంటల బీమా జాబితాలో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆర్‌సీల ద్వారా సుబాబుల్, జామాయిల్ కొనుగోళ్లను వెంటనే నిలుపుదల చేసి రైతు పీవో ద్వారా మాత్రమే ఈ పంటలను కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 2017 డిసెంబర్‌లో ప్రారంభమైన సుబాబుల్, జామాయిల్ రైతుల పోరాటం ద్వారా 2018 జనవరిలో తెలంగాణ సుబాబుల్, జామాయిల్ రైతు సంఘం ఆవిర్భవించిందని చెప్పారు. ఈ సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతులను ఐక్యపరిచి ఐపీసీ వద్ద అనేక రూపాల్లో ఆందోళనలు, పోరా టాలు నిర్వహించిందని చెప్పారు. ఈ పోరాటాల ఫలితంగానే రైతుల నుంచి సుబాబుల్, జామాయిల్ పంటలను ఐపీసీ నేరుగా కొనుగోలు చేస్తుందన్నారు. 2018-19 సీజన్‌లో 70% రైతుల వద్ద నుంచి ఐపీసీ సుబాబుల్, జామాయిల్ పంటలను కొనుగోలు చేసిందని వివరిం చారు. ఆర్‌సీల ద్వారా సుబాబుల్, జామాయిల్ పంటల కొనుగోలు పేరుతో రైతులను తీవ్రంగా మోసం చేస్తున్నారని విమర్శించారు. వెం టనే ఆర్‌సీల విధానాన్ని బంద్ చేయాలని డిమాండ్ చేశారు. ఏన్కూరు, మధిర, బోనకల్, ఎర్రుపాలెం, ఖమ్మం కేంద్రాల్లో మార్కెట్‌యార్డ్‌ల ద్వారా ప్రభుత్వం నేరుగా సుబాబుల్, జామాయిల్ పంటలను కొను గోలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, పుసులూరి నరేంద్ర, చావా రామక్రిష్ణ, నల్లమల వెంకటేశ్వరరావు, బొంతు రాంబాబు, అడపా రామకోటయ్య, రాయల చంద్రశేఖర్, తాతా భాస్కర్‌రావు, బొర్రా మురళి, వడ్లమూడి నాగేశ్వరరావు, చంచు విజయ్, చింతనిప్పు చలపతిరావు, డి.రమేష్, కొప్పుల క్రిష్ణయ్య, వట్టికొండ శ్రీనివాసరావు, తాతా సీతారామ్, సండ్ర ప్రసాద్, స్వర్ణ క్రిష్ణారావు, బుద్దులూరి నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

266
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles