ప్రణాళిక తోనే కచ్చితమైన ఫలితాలు వస్తాయి

Sun,May 19, 2019 12:37 AM

పాల్వంచ: ప్రధానోపాధ్యాయుడు కచ్చితంగా ఉంటే ఆ పాఠశాల అన్ని విధాలుగా బాగుపడుతుందని, అనుకున్న ఫలితాలు ఖచ్చితంగా వస్తా యని ఐటీడీఏ పీఓ వీపీ గౌతమ్ అన్నారు. పాల్వంచలోని కేఎల్‌ఆర్ ఫార్మసీ కళాశాలలో శనివారం జిల్లాలోని ఉన్నత పాఠశాలలు, ఆశ్రమ, కేజీబీవీ పాఠశాలల ప్రధానోపాద్యాయులతో పదో తరగతి పరీక్షా ఫలితాలు, రాబోయే విద్యా సంవత్సరంలో చేపట్టాల్సి కార్యక్రమాలపై జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పదో తరగతి ఫలితాలను ప్రామాణికంగా తీసుకుని పనిచేయవద్దని విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ముందు నుంచి కూడా ఒక ప్రణాళిక ప్రకారంగా అమలు చేస్తే కచ్చితమైన ఫలితాలు వస్తాయని అన్నారు. ఉన్నత పాఠశాలల్లో చేరే విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలో బేసిక్స్ లేకపోవడం వల్ల మేం ఏమి చేయలేక పోతున్నామనే సమాధానం కరెక్టు కాదని ఆయన అన్నారు.

గత పది సంవత్సరాల నుంచి కూడా విద్యా శాఖ అనేక కార్యక్రమాలు ఎల్‌ఈపి, త్రీఆర్‌ఎస్ వంటి వాటిని అమలు చేస్తున్నదని దాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తే ఆశించిన ఫలితాలు రావడం ఖాయమని తెలిపారు. ప్రాథమిక స్థాయిలో బేసిక్స్ లేక పోయినా కూడా ఆరో తరగతిలో చేరిన తర్వాత ఆ పిల్లవాడికి బేసిక్స్ నేర్పమని కేవలం సిలబస్‌ను దృష్టిలో పెట్టుకుని బేసిక్స్ లేని పిల్లను పక్కన పెడితే లాభం లేదని, ఆరు నుంచే వాళ్లకు బేసిక్స్ నేర్పుకుంటూ సాగితే పదో తరగతికి వచ్చే సరికి అటోమెటిక్‌గా ఈజీగా పది పాస్ కా వడం ఖాయమని ఆయన వెల్లడించారు. ప్రతి విద్యార్థిలో ఉండే భయాన్ని ముందుగా పొగొట్టాలని అలాగే వారిలో ప్రశ్నించే తత్వానికి ఎదిగే విధంగా తయారు చేయాలని ఆయన కోరారు. అరచేతిలో ప్రపంచం ఇంటర్ నెట్ ద్వారా వచ్చిందని, దీని అన్ని విధాలు వినియో గించుకోవచ్చి ప్రస్తుతం అనేక నెట్ కంపెనీలు తక్కువ ధరకు నెట్ సౌకర్యం కల్పిస్తున్నదని, దాని ద్వారా నెట్‌లో విద్యకు సంబంధించిన అనేక వీడియోలను డౌన్ లోడ్ చేసుకుని కేయాన్ ద్వారా పిల్లలకు వీడియా పాఠశాలు చూపించ వచ్చని దీనిపై అందరూ సద్వినియోగం చేసుకుని విద్యార్థుల బంగారు భవిషత్తుకు పునాదులు వేయాలని ఆ యన కోరారు.

వచ్చే విద్యా సంవత్సరం 2019-20 సంవత్సరం లోనైనా మంచి ఫలితాలు సాధించేలా ఇప్పటి నుంచే అమలుకు శ్రీకారం చుట్టాలని అయన ఆన్నారు. నూతన విద్యా సంవత్సరంలో తీఆర్స్ కార్యక్రమం కచ్చితంగా అమలు చేయాలని విద్యార్థులకు చదవడం, రాయడం, చతుర్విద పక్రియలు వచ్చేలా కృషి చేయాలని, ఈ కార్యక్రమం అమలు జరిగే మూడు నెలల పాటు కూడా సిలబస్‌ను పక్కన పెట్టి కేవలం దీనిపైనే దృష్టి పెట్టాలని ఆయన కోరారు. అలాగే ప్రతి క్లాస్‌లో జరిగే త్రీఆర్స్‌పై ఎప్పటి కప్పుడూ ఆయా క్లాస్ టీచర్లతో సమీక్షా సమావేశాలు నిర్వహించి ఇంకా వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ పథకం అమలుపై కూడా ఆయా మండల్లాలోని అధికా రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆయన తెలిపారు. విద్యా సంవత్సరంలో చేపట్టే కార్యక్రమాల గురించి ఆయన వారికి వివరించారు. ఈ సమావేశంలో డీఈఓ వాసంతి మాట్లాడుతూ....వచ్చే విద్యాసంవత్సరం మొదలులోనే టెక్స్‌బుక్స్‌లను అందరూ పాఠశాల లకు చేర్చుకునే విధంగా చర్యలు తీసుకోవాలని, ఉపాధ్యాయులు తక్కువగా ఉన్న చోట విద్యావలంటీర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పదో తరగతి ఫలితాలపై ఆమె సమీక్షించి వచ్చే విద్యాసంవత్సరంలో నూటికి నూరు శాతం పాసయ్యే విధంగా ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేయాలని ఆన్నారు. అనతరం జిల్లాలో పదో తరగతిలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించిన 12 ఉన్నత పాఠశాలల ప్రధానోపాదాయులను పీఓ, డీఈఓలు శాలు వాలతో ఘనంగా సత్కరించారు. వచ్చే విద్యా సంవత్సరంలో అన్ని పాఠశాలల ప్రదానోపాధ్యాయులు ఇదే రీతిన సన్మానాలు చేయించుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డీడీ జహీ రుద్దీన్, ఏసీజీఈ రామారావు, డీఎస్‌ఓ చలపతిరావు, డీసీఈబి మాధవరావు, ఏసీఎం రమణయ్యలు పాల్గొన్నారు.

267
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles