చలివేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ కర్ణన్

Sat,May 18, 2019 01:23 AM

ఖమ్మం, మే 17 (నమస్తే తెలంగాణ): ఖమ్మం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని, మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా వేసవిని దృష్టిలో ఉంచుకొని చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ బాధ్యులను కలెక్టర్ కర్ణన్ అభినందించారు. అనంతరం స్తంభాద్రి అర్బన్ డెవలెప్‌మెంట్ అథారిటి (సుడా) ఖమ్మం వారిచే సుడా పరిధి ప్రాంతాలలో ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు కార్యక్రమానికి సంబంధించిన ట్రాక్టర్లను శ్రీశ్రీ సర్కిల్ వద్ద సుడా చైర్మన్, కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్‌తోపాటు మున్సిపల్ కమిషనర్ జే.శ్రీనివాస్‌రావు, అసిస్టెంట్ కమిషనర్ జగన్ ఉన్నారు. చలివేంద్ర ప్రారంభంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ బాధ్యులు కొటేరు వెంకట్‌రెడ్డి, ట్రైనర్ వెంకట్, సభ్యులు నారాయణ, ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు కార్యక్రమంలో సుడా టీపీబీఓ భాస్కర్, వెంకటరమణ, అసిస్టెంట్ కమిషనర్ పాల్గొన్నారు.

288
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles