ఖమ్మం ప్రజల రుణం మర్చిపోను..

Fri,May 17, 2019 01:34 AM

-5 ఏండ్ల ప్రజా జీవితం ఎన్నో పాఠాలు నేర్పింది
-ఖమ్మం, కొత్తగూడెం జడ్పీపీఠాలపై గులాబీ జెండా
-ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధి కృషి చేస్తా...
-ఈ నెల 28 వరకు లండన్‌ పర్యటన
-ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌
ఖమ్మం, నమస్తే తెలంగాణ : ఖమ్మం నియోజకవర్గం, ఖమ్మం జిల్లా ప్రజల రుణాన్ని ఎన్నటికి మరిచిపోనని, రాజకీయాలలోకి కొత్తగా ప్రవేశించిన తనను రెండుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నుకున్న ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలు పుతున్నానని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. గురువారం ఖమ్మంలోని వీడీఓస్‌కాలనీలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మా ట్లాడారు. 2012 సంవత్సరంలో తన రాజకీయప్రస్థానం మొదలైందన్నారు. తొలిసారిగా తాను 2014 మే 16వ తేదీన ఖమ్మం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, సరిగ్గా నేటికి 5 ఏండ్లు పూర్తి అయిందన్నారు. ఈ 5 సంవత్సరాల ప్రజా జీవితం ఎన్నో పాఠాలను నేర్పిం దని, తాను ఎంతో నేర్చుకున్నానన్నారు. ప్రజల కష్టాలను దగ్గర ఉండి చూసి పరిష్కరించే భాగ్యాన్ని ఖమ్మం ప్రజలు తనకు అందించారన్నారు. ఇదే సంద ర్భంలో రెండో సారి కూడా తనను శాసనసభ్యుడిగా ఎన్నుకున్నారన్నారు. ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధితో పాటు ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ చెప్పారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సీతా రామ ఎత్తిపోతల పథకాన్ని నిర్దేశించిన గడువులోగా పూర్తి అయ్యేలా తాను పర్యవేక్షిస్తానని ఎమ్మెల్యే అన్నారు.

ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు సాగునీటికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉం డదని, గోదావరి జలాలతో ఖమ్మం జిల్లాలోని సా గర్‌ ఆయకట్టు కూడా సస్యశ్యామలం అవు తుందన్నా రు. ఇటీవల జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఘనవిజయం సాధిస్తారని ఆశాభా వం వ్యక్తం చేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల జడ్పీ పీఠాలపై గులాబీ జెండా ఎగరవేయడం ఖా యమని పువ్వాడ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీని ఈ ఎన్నికల్లో ఓడించ డానికి మిగిలిన అన్ని పార్టీలు ఏకమయినప్పటికీ ప్రజలు మాత్రం గులాబీ పార్టీకి బ్రహ్మరథం పట్టారన్నారు. తన నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలం జడ్పీటీసీని అత్యధిక మెజార్టీతో గెలుస్తామని, అదేవిధంగా మండలం లోని 14 ఎంపీటీసీ స్థానాలలో టీఆర్‌ఎస్‌ 13, సీపీఐ ఒక స్థానంలో పోటీ చేశామని, అన్ని స్థానాలను తామే గెలుస్తామని ఎమ్మెల్యే అన్నారు. జడ్పీటీసీ అభ్యర్థిగా ఉన్నత విద్యను అభ్యసించిన గిరిజన యువతికి అవకాశమిచ్చామని, యువత ద్వారా అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందనే ఉద్దేశంతోనే అవకాశం ఇచ్చామన్నారు. ఈ ఎన్నికలలో రఘునాథపాలెం మండల ప్రజలు ఏకపక్ష తీర్పును ఇస్తారన్నారు. తన ఏడేండ్ల రాజకీయ జీవితంలో అన్ని విషయాలలో రఘునాథపాలెం మండల ప్రజలు తనను ఆదరించారని, ఒక కుటుంబ సభ్యు డిగా భావించారన్నారు. ఈ ఎన్నికలలో కూడా తనవెంటే నడిచారని ఎమ్మెల్యే గుర్తుచేశారు. మండలంలోని సర్పంచ్‌లు, మండల నాయకులు టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయానికి తీవ్రంగా కృషి చేశారని వారందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.

ఈ నెల 28 వరకు లండన్‌ పర్యటన...
తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజా జీవితం నుంచి పక్కకు వెళ్లలేదని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా ఇతర ప్రాంతాలకు వెళ్లలేకపోయానని, ఈ నెల 17 నుంచి 28వతేదీ వరకు కుటుంబ సభ్యులతో కలిసి లండన్‌ వెళ్తున్నానన్నారు. ప్రజలకు ఏదైనా సమస్యలుంటే క్యాంప్‌ కార్యాలయంలో తన సిబ్బంది అందుబాటులో ఉంటారని, వారికి తెలియజేయాలన్నారు. అత్యవసరమైతే తనుకు కూడా ఫోన్‌ చేసి చెప్పవచ్చు అన్నారు. రఘునాథపాలెం మండలం టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు మద్దినేని వెంకటరమణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఎమ్మెల్యే పువ్వా డ అజయ్‌కుమార్‌ నాయకత్వంలో మండలంలోని అన్ని ఎంపీటీసీ స్థానాలను, జడ్పీటీసీ స్థానాన్ని టీఆర్‌ఎస్‌ గెలవబోతుందన్నారు. ఖమ్మం ఏఎంసీ మాజీ చైర్మన్‌ గుండాల కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లతో ప్రజలలోకి వెళ్లడం వలన రాష్ట్రంలో రెండో సారి అధికారంలోకి రావడం జరిగిందన్నారు. పువ్వాడ అజయ్‌కుమార్‌ ఇతర ఎమ్మెల్యేల మాదిరి కా కుండా సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చడంలో వినూత్న పద్ధతులను అవలంభించారన్నారు. కల్యాణలక్ష్మీ చెక్కులను లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి అందించిన ఏకైక ఎమ్మెల్యే పువ్వాడ అన్నారు. ఇతరత్ర అభివృద్ధి పథకాల అమలులో కూడా అవినీతికి ఆస్కారం లేకుండా ముందుకు సాగుతున్నారన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఖమర్‌, రఘునాథపాలెం మండల టీఆర్‌ఎస్‌ నాయకులు కుర్రా భాస్కర్‌రావు, ఖమ్మం నగర టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కమర్తపు మురళీ, కార్పొరేటర్‌ పగడాల నాగరాజు, టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగ నాయకుడు నున్నా మాధవరావు, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, మాటేటి రామారావు, మెంటెం రామారావు పాల్గొన్నారు.

331
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles