వైభవంగా రామయ్య నిత్యకల్యాణం

Fri,May 17, 2019 01:32 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ మే16: పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం రామాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారు జామున అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి ముందుగా సుప్రబాతసేవ నిర్వహించారు. తదుపరి గోదావరి నది నుంచి తీర్థబిందెను తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేశారు. అర్చన, సేవాకాలం, పుణ్యఃవచనం తదితర పూజలు గావించారు. భక్తులు అధిక సంఖ్యలో భద్రాచలం తరలివచ్చి పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. రామాలయానికి చేరుకొని రామున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

శ్రీలక్ష్మీతాయారు అమ్మవారిని, అభయాంజనేయ స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. రుష్యమూక మ్యూజియాన్ని సందర్శించి సీతమ్మవారి నగలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం అర్చకులు ఆలయంలోని బేడా మండపంలో రామయ్యస్వామికి ఘనంగా నిత్యకల్యాణం నిర్వహించారు. భక్తులు కల్యాణంలో పాల్గొని తిలకించి పునీతులయ్యారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

287
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles