రైతులను ఆదుకోండి..

Fri,May 17, 2019 01:31 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ : సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌తో గురువారం సాయంత్రం ఆయన చాంబర్‌లో భేటీ అయ్యారు. నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమ స్యలను కలెక్టర్‌కు వివరించారు. ముఖ్యంగా తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలను, రైతులను వెంటబెట్టుకుని వచ్చి కలెక్టర్‌ను కలిశారు. అంతకు ముందు జాయింట్‌ కలెక్టర్‌ అనురాగ్‌ జయంతిని కూడా కలిసి రైతుల సమస్యలను వివరించారు. కల్లూరు మండలం బత్తులపల్లి గ్రామం లో లిప్ట్‌ఇరిగేషన్‌ కింద 250 ఎకరాల ఆయకట్టు స్తీరికరణ ఉందని ఆ ఆ యకట్టుకు సాగర్‌ కాలువ నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లను సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన 40 హెచ్‌పీ మోట ర్‌, పీఏసీ పైపులైన్‌ నిర్మాణం విఫలమయిందని ఎమ్మెల్యే కలెక్టర్‌కు చెప్పారు. ఇరిగేషన్‌ అధికా రుల నిర్లక్ష్యం కారణంగా రైతులు నష్టపోయారని ఎన్నిమార్లు చెప్పినా అధికారులు, కంట్రాక్టర్‌లు స్పందించడం లేదని ఎమ్మెల్యే వాపోయారు.

ఆయకట్టు రైతులను ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా కిష్టారం ఓసీ కొరకు సింగరేణి సంస్థ సేకరించిన సత్తుపల్లి మండలం జగన్నాథపురం గ్రామంలోని పట్టా భూములలో ఉన్న మామిడి, జామాయిల్‌, ఇతర చెట్లకు నూతన భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇస్తామని గతంలో ఇచ్చిన హామిని ఇంత వరకు నెరవేర్చలేదని కలెక్టర్‌ దృష్టికి ఎమ్మెల్యే సండ్ర తీసుకువచ్చారు. పట్టా భూములతో పాటు అసైన్‌మెంట్‌ భూములకు ఒకేసారి నష్టపరిహారం ఇప్పించాలన్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆర్‌ఆర్‌ ప్యాకేజ్‌ వర్తింపచేయాలన్నారు. వీటితో పాటు నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్య లు పరిష్కరించాలని కలెక్టర్‌ను కోరారు. ఎమ్మెల్యేతో పాటు నియోజకవర్గానికి చెందిన రైతులు తదితరులు పాల్గొన్నారు.

266
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles