‘అంగన్‌వాడీ’లు అధ్వానం

Fri,May 17, 2019 01:29 AM

రఘునాథపాలెం: చిన్నారులకు ఆటపాటలు, అక్షరాలు నేర్పించేందుకు, వారితోపాటు గర్భిణిలకు, బాలింతలకు పోషక విలువలతో కూడిన అల్పాహారం-ఆహారం అందించేందుకు ఉద్దేశించిన అంగన్‌వాడీ కేంద్రాలు... లక్ష్యానికి దూరంగా ఉంటున్నాయి. పర్యవేక్షణ లోపం కారణంగా మండలంలోని అనేక కేంద్రాలు గాడి తప్పాయి. మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాలను రెండు రోజులపాటు ‘నమస్తే తెలంగాణ’ పరిశీలించింది. కొన్ని కేంద్రాలకు తాళం కప్పలు దర్శనమిచ్చాయి. మరికొన్ని కేంద్రాలలో పిల్లల సంఖ్య అతి తక్కువగా (ఐదారుగురు) కనిపించింది. హాజరు పట్టికలో మాత్రం& ఎక్కువమంది పిల్లలు ఉన్నట్టుగా నమోదై ఉంది.

కొన్ని కేంద్రాల్లో 25 మందికి పైగా పిల్లలు ఉన్నట్టుగా, అందరూ హాజరవుతున్నట్టుగా రికార్డులు చూపుతున్నాయి. వాస్తవానికి అక్కడకు వస్తున్న పిల్లల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. కోటపాడు గ్రామంలోని 1,2 కేంద్రాల్లోని పిల్లల సంఖ్య (రిజిస్టర్‌ ప్రకారంగా) 15. గత నెల 29న ఇక్కడ కేవలం నలుగురైదుగురు మాత్రమే కనిపించారు. అదే రోజున, హాజరు పట్టికలో మాత్రం& ‘పిల్లలంతా హాజరైనట్టు’ ఉంది. చిమ్మపూడి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాలు ఈ నెల 13న అసలే తెరుచుకోలేదు. ఈ నెల 15న రేగులచలక కేంద్రాన్ని ఉదయం 10 గంటలకు కూడా తెరవలేదు. వీటిపైవు పర్యవేక్షకులు కన్నెత్తి చూడడం లేదు.

231
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles