ఏవో- కానిస్టేబుల్‌ వాగ్వాదంపై విచారణ

Fri,May 17, 2019 01:28 AM

చింతకాని, మే 16 : మండలంలోని రామకృష్ణాపురం గ్రామంలో మధిర వ్యవసాయ శాఖ ఏవో, మహిళా కానిస్టేబుల్‌ మధ్య ఈ నెల 14న పరిషత్‌ ఎన్నికల సందర్భంగా జరిగిన వాగ్వాదంపై చింతకాని ఎంపీడీవో లలితకుమారి గురువారం విచారించారు. రామకృష్ణాపురం పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విచారణ కార్యక్రమంలో ప్రత్యక్ష సాక్షులుగా భావిస్తున్న వైద్య సిబ్బంది ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలను ఘటనకు దారి తీసిన పరిణామాలుపై ఆమె వివరణ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వీరపనేని శ్రీనివాసరావు, కార్యదర్శి సురేశ్‌, ఏఎన్‌ఎం జయమ్మ, ఆశ కార్యకర్తలు పాలకుర్తి రాంబాయి, కొప్పుల సంతోషి, పగిడిపల్లి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

235
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles