చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి

Fri,May 17, 2019 01:27 AM

తిరుమలాయపాలెం, మే, 16: చేపల వేటకు వెళ్లిన మత్స్య కార్మికుడు ప్రమాదవశాత్తు మృతిచెందిన సంఘటన గురువారం మండలంలోని బచ్చోడులో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని బచ్చోడులో మత్స్య కార్మికుడు చెన్నబోయిన రామకృష్ణ(38) ఉదయం ఏనిగ చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. చెరువులో తెప్ప ద్వారా చేపలు పట్టేందుకు వల విసిరిన సమయంలో అదుపుతప్పి చెరువులో పడ్డాడు. వల కాళ్లకు చుట్టు కోవడంతో నీళ్లలో మునిగిపోయి మృతిచెందాడు. మృతునికి భార్య యల్లమ్మ, ఇద్దరు పిల్లలున్నారు.

బాదితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చేపల వృత్తి ద్వారా జీవించే రామకృష్ణ అకస్మిక మృతితో ఆ నిరుపేద కుటుంబం విశాదంలో మునిగిపోయింది. ఆర్థికంగా సంపాదించే వ్యక్తిని కోల్పోయిన ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. మత్స్య కార్మికుని మృతితో బచ్చోడులో విషాద చాయలు అలుముకున్నాయి. మరణించిన కార్మికుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మత్స్య కార్మిక సంఘం మండల కమిటీ అధ్యక్షుడు ఓర వెంకటేశ్వర్లు, ఎన్డీ నాయకులు తిమ్మిడి హనుమంతరావు, గొర్రెపాటి రమేష్‌ ప్రభుత్వానికి విజప్తి చేశారు.

240
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles