అనారోగ్యంతో అంగన్‌వాడీ టీచరు మృతి

Fri,May 17, 2019 01:26 AM

వేంసూరు, మే 16: మండలంలోని కుంచపర్తి గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచరు కిన్నెర సునీత (38) గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సునీత గురువారం ఒక్కసారిగా ఇంట్లో కుప్పకూలి పడిపోవడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు.

చలాకీగా ప్రతి ఒక్కరితో కలుపుగోలుగా మాట్లాడుతూ మండల అంగన్‌వాడీ సంఘం అధ్యక్షురాలిగా పనిచేస్తున్న ఆమె ఒక్కసారిగా ఈ విధంగా అకాల మృతి చెందడంతో తోటి అంగన్‌వాడీలు, అధికారులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. విషయం తెలుసుకున్న సీడీపీవో కొండమ్మ, ఏసీపీడీవో తోయజాక్షి, ఎల్‌డీసీలు శ్రీను, ప్రవళిక, సూపర్‌వైజర్లు భవాని, అనూరాధ, అంగన్‌వాడీ టీచర్లు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

167
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles