విద్యుదాఘాతంతో దుక్కిటెద్దు మృతి

Fri,May 17, 2019 01:26 AM

కూసుమంచి, మే16: మండలంలోని గురువాయగూడెంలో ఓ రైతుకు చెందిన దుక్కిటెద్దు గురువారం విద్యుదాఘాతం తో మృతి చెందింది. వివరాలిలా ఉన్నా యి.. మూడు రోజుల క్రితం వచ్చిన ఈ దురుగాలులకు గ్రామ శివారులోని పొ లాల వద్ద విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. ట్రాన్స్‌కో సిబ్బంది తీగలను తిరిగి బిగించలేదు. గురువారం మధ్యాహ్నం రైతు సారబుడ్ల భుజంగరెడ్డికి చెందిన దుక్కిటెద్దు పొలాల్లో మేతకు వెళ్లి విద్యుత్‌ తీగలను తాకింది. తీగలకు కరెంటు సరఫరా జరుగుతుండడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృత్యువాత పడింది. ఎద్దు విలువ రూ.45 వేల వరకు ఉంటుందని, ట్రాన్స్‌కో అధికారులు తనకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని రైతు భుజంగరెడ్డి విజ్ఞప్తి చేశారు.

సుబ్లేడులో పశువు మృతి
తిరుమలాయపాలెం, మే, 16: మండలంలోని సుబ్లేడులో విద్యుదఘాతం సంభవించి ఓ అరక ఆవు మృతిచెందింది. బాదితుల కథనం ప్రకారం తోట వెంకన్నకు చెందిన పశువులు మేత కొరకు పొలాల్లోకి వెళ్లాయి. అరక ఆవు మేత మేస్తున్న సమయంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకడంతో విద్యుదఘాతం సంభవించి అక్కడికక్కడే మృతిచెందింది. ట్రాన్స్‌ఫార్మర్‌ చుట్టు రక్షణ వలయం లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

172
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles