ఆమెకు రక్షణ కరువు

Fri,May 17, 2019 01:24 AM

ఖమ్మం క్రైం, మే,16: మహిళల్లో ఆత్మగౌరవాన్ని పెంపొందించి, ధైర్యాన్ని కల్పించి, అండగా నిలవాల్సిన షీటీం కార్యకలాపాలు ఖమ్మం నగరంలో నత్తనడకగా ఉన్నాయనే ఆరోపణలు వినవస్తున్నాయి. రద్దీ ప్రదేశాల్లో, కళాశాలలు, పాఠశాలలు, పలు కూడళ్లలో మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే పోకిరీల చర్యలను నియంత్రించడంలో ఈ బృందం విఫలమవుతున్నదనే విమర్శలు ఉన్నాయి.

పలు ప్రాంతాల్లో బైక్‌రాయుళ్లు, పోకిరీలు తిష్ఠ వేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వారిని నియంత్రించడంలో అలసత్వం పలువురు మహిళలు, విద్యార్థినుల్లో ఆవేదనకు కారణమవుతున్నాయనే విమర్శలున్నాయి. గతంలో కంటే ఇటీవల కాలంలో పలు ప్రాంతాల్లో అల్లరిమూకల సంచారం అధికంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. విద్యార్థినులకు, మహిళా ఉద్యోగినులకు ఇబ్బంది కలిగించే చర్యలకు పాల్పడే వ్యక్తులను, మూకలను గుర్తించడంలో అలసత్వం చోటు చేసుకుంటోంది. ఖమ్మం నగరంలో షీటీం కార్యకలాపాలు నామమాత్రంగా జరుగుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. జిల్లా కేంద్రంలో షీ బృందాలు మహిళలకు రక్షణ సరైన రక్షణ కల్పించడంలో వైఫల్యం చెందుతున్నాయని నిర్వహిస్తున్న కార్యకలాపాలు సాగిస్తున్నాయని సంగతి ప్రజలకు కూడా తెలియడం లేదు. రద్దీ ప్రాంతాలు, కళాశాలల్లో షీ బృందాల అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి మహిళలను, విద్యార్థినులను చైతన్య పరిచే అవగాహన సదస్సులు చేపట్టలేకపోతున్నారనే విమర్శలున్నాయి. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే చట్టాలు ఎంత కఠినంగా ఉన్నాయో యువతకు వివరించే విధంగా కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నారని విద్యార్థులు పేర్కొంటున్నారు.

మహిళలపై లైంగిక వేధింపులు, సెల్‌ఫోన్స్‌, ఈమెయిల్‌, ఫేస్‌బుక్‌ల్లో అపరిచిత వ్యక్తులు మహిళలను వేధింపులకు గురిచేస్తే వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకున్నారో వివరించే కార్యక్రమాలే ఇక్కడ పని చేసే షీటీమ్‌లు నిర్వహించలేకపోతున్నాయని వారు పేర్కొంటున్నారు. కేవలం తమకు ఫిర్యా దు వస్తేనే తప్ప స్పందిద్దాంలే అనే ధోరణిలో ఇక్కడ షీటీమ్‌ కార్యకలాపాలు సాగుతున్నట్లు ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తుమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళల భద్రతకు ఏర్పాటు చేయబడ్డ ఈ షీటీమ్‌లు జిల్లాలో మరింత చురుగ్గా తమ కార్యకలాపాలు సాగించేలా జిల్లా పోలీస్‌ ఉన్నతాధికారి దృష్టి సారిస్తేనే తప్ప వీరి కార్యకలాపాలు మెరిగుపడేలా కన్పించడం లేదని మహిళలు కోరుతున్నారు.

‘ఆమె’ భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చింది. మహిళలను వేధించే వారిపై ఉక్కుపాదం మోపాలని, ఈవ్‌ టీజింగ్‌ పాల్పడే వారిపై చట్టం కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా షీటీంలను ఏర్పాటు చేసింది. కాని జిల్లాలో ఏర్పాటు చేసిన షీటీంలు ఆరంభ శూరత్వన్నే ప్రదర్శించాయి. కాని క్షేత్రస్థాయిలో షీటీమ్‌ కార్యకలాపాలు ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఓ సీనియర్‌ మహిళా ఐపీఎస్‌ అధికారిణి షీటీమ్‌ బృందాలకు నాయకత్వం వహిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం వీరి కార్యకలాపాలు కానరావడం లేదనే విమర్శలున్నాయి. మొదట్లో బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌, కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించినా రానురాను వీరి కార్యకలాపాలు మందగించి కేవలం ఫిర్యాదు వస్తేనే స్పందించేలా మారాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం షీటీమ్‌లను ప్రారంభించి పారదర్శంగా షీటీమ్‌ విధులు ఉండేలా చర్యలు చేపట్టింది. షీటీమ్‌లకు స్పై కెమెరాలు సైతం అందించింది. ఎవరైన ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతుంటే వారి చర్యలను ఆధారాలతో సహా పట్టుకునేందుకు, అనంతరం వీరిపై చట్టప్రకారం చర్యలు చేపట్టేందుకు షీ బృందానికి సౌకర్యాలు కల్పించింది. కొంతకాలం జిల్లాలో షీ బృందాలు కార్యకలాపాలు సమర్థవంతంగా సాగాయి. అనంతరం ఆయా సబ్‌ డివిజనల్‌ అధికారులే షీటీమ్‌లకు ఇన్‌చార్జ్‌లుగా ఉండే విధంగా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.

పెచ్చురిల్లుతున్న ఈవ్‌ టీజర్లు..
జిల్లా కేంద్రంతో పాటు ప్రధాన పట్టణాలు, మండలాలు, ఆఖరి గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఇటీవల మహిళలపై వేధింపులు ఎక్కువయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. కళాశాలలు, పాఠశాలలు వదిలారంటే ఆయా ప్రాంతాల్లో విద్యార్థినులను వేధించే ఆకతాయిల సంఖ్య పెరిగిపోతోందని పలువురు ఆరోపిస్తున్నారు. మొదట అమ్మాయిలపై చిన్నచిన్న సైగలతో ప్రారంభమయ్యే పోకిరీల చర్యలు చివరకు తారా స్థాయికి చేరి ప్రేమ పేరుతో బెదిరింపులకు పాల్పడే వరకు వెళ్తుంది. ఉద్యోగాలకు వెళ్లివచ్చే మహిళలపై ఆకతాయిల వేధింపులు అధికంగానే ఉన్నాయి. ఏమంటే ఏమంతుందోనని కొందరు మహిళలు నోరు మెదపకుండా మౌనంగా వీరి ఆగడాలను భరిస్తూనే ఉన్నారు. కేవలం పోలీసుల దృష్టికి వచ్చేవి వేళ్లపై లెక్కబెట్టకలిగే సంఘటనలు మాత్రమే అంటే అతిశయోక్తి కాదు. పోకిరీల ఆగడాలకు జిల్లా కేంద్రంలో కొందరు విద్యార్థినీలు మానసీకంగా ఇబ్బందులు పాల్పడిన సంఘటనలు అనేకమున్నాయి.

అవగాహన కల్పనలో అలసత్వం
జిల్లా కేంద్రంలో షీ బృందాలు తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయని సంగతి ప్రజలకు కూడా తెలియడం లేదు. రద్దీ ప్రాంతాలు, కళాశాలల్లో షీ బృందాల అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి మహిళలను, విద్యార్థినులను చైతన్య పరిచే అవగాహన సదస్సులు చేపట్టలేకపోతున్నారనే విమర్శలున్నాయి. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే చట్టాలు ఎంత కఠినంగా ఉన్నాయో యువతకు వివరించే విధంగా కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నారని విద్యార్థులు పేర్కొంటున్నారు. మహిళలపై లైంగిక వే ధింపులు, సెల్‌ఫోన్స్‌, ఈమెయిల్‌, ఫేస్‌బుక్‌ల్లో అపరిచిత వ్య క్తులు మహిళలను వేధింపులకు గురిచేస్తే వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకున్నారో వివరించే కార్యక్రమాలే ఇక్కడ పని చేసే షీటీమ్‌లు నిర్వహించలేకపోతున్నాయని వారు పే ర్కొంటున్నారు. కేవలం తమకు ఫిర్యాదు వస్తేనే తప్ప స్పందిద్దాంలే అనే ధోరణిలో ఇక్కడ షీటీమ్‌ కార్యకలాపాలు సాగుతున్నట్లు ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. షీటీమ్‌ లు జిల్లాలో చురుగ్గా తమ కార్యకలాపాలు సాగించేలా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

179
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles