‘తెలంగాణ గ్రామాయణం’ ఎంతో విశిష్టమైనది..

Thu,May 16, 2019 01:13 AM

-పుస్తకావిష్కరణలో కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌
ఖమ్మం వ్యవసాయం : ఆరు దశాబ్దాల నాటి తెలంగాణ గ్రామ స్వరూపాన్ని పాలనా వ్యవస్థను తన స్వీటు అనుభవం ప్రాతిపధికగా పలు ఆసక్తి విషయాలను వివరిస్తూ ఆచార్య మారంరాజు సత్యనారాయణరావు రంచించిన తెలంగాణ గ్రామాయణం ఎంతో విశిష్టమైనదని కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం నగరంలోని కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో కలెక్టర్‌ కర్ణన్‌, మారంరాజు సత్యనారాయణరావు రాసిన ‘తెలంగాణ గ్రామాయణం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటితరం తమ గ్రామాల పూర్వ చరిత్రను సమగ్రంగా తెలుసుకోవాలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. సమాజశాస్త్ర దృష్టి కోణంలో ఎన్నో సాంస్కృతిక, ఆర్థిక పాలనా పరమైన గ్రామ నిర్మాణాన్ని ఈ పుస్తకం తెలియజేస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషనర్‌ సభ్యులు జూలురు గౌరీశంకర్‌ మాట్లాడుతూ.. ఆనాటి తెలంగాణ గ్రామ జీవన విధానం, సామాజిక స్థితిగతులు, గ్రామనిర్మాణం రెవెన్యూ, శిస్తు విధానాలు ఏ విధంగా ఉన్నాయో ఈ పుస్తకంలో మారంరాజు కళ్లకు కట్టినట్లు చిత్రించారన్నారు. ఆచార్య మారంరాజు తాను ప్రత్యక్షంగా అనుభవించిన విషయాలను నిజాం రాజ్యంలో హైద్రాబాద్‌ రాష్ట్రంలో తెలంగాణ గ్రామపాలనా వ్యవస్థ ఎలా ఉండేదో సమగ్రంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు ప్రసేన్‌, కాళోజీ అవార్డు గ్రహిత సీతారాం, ప్రముఖ విద్యావేత్త ఐవీ రమణారావు, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హనుమంతు పాల్గొన్నారు.

179
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles