ఘనంగా రామయ్య నిత్యకల్యాణం

Thu,May 16, 2019 01:13 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ మే15: పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం రామాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం అర్చకులు స్వామివారికి అభిషేకం, ఆరాధన, అర్చన, సేవాకాలం తదితర పూజలు గావించారు. రాష్ట్ర నలుమూలల నుంచి భద్రాచలం వచ్చిన భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. రామాలయానికి చేరుకున్న భక్తులు రామున్ని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఆలయంలో ఉన్న శ్రీలక్ష్మీతాయారు అమ్మవారిని, అభయాంజనేయస్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అర్చకులు ఆలయంలోని బేడా మండపంలో రామయ్యకు ఘనంగా నిత్యకల్యాణం నిర్వహించారు. భక్తులు కల్యాణంలో పాల్గొని తిలకించి పునీతులయ్యారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

140
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles