ఐటీడీఏ పీవో విస్తృత పర్యటన

Thu,May 16, 2019 01:13 AM

దుమ్ముగూడెం, మే 15: మండల పరిధిలోని బట్టిగూడెంతో పాటు పలు గ్రామాల్లో బుధవారం భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్‌ విస్తృత పర్యటన చేశారు. బట్టిగూడెం గ్రామాన్ని సందర్శించిన వర్షాకాలంలో విద్యార్థుల రాకపోకలు గురించి ఆరాతీశారు. బట్టిగూడెంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చెరువులు నిండినప్పుడు నీరు రహదారిపైకి రావడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఉంటాయని పీవో దృష్టికి తెచ్చారు. కమలాపురం, కొత్తూరులో ఐబీ శాఖ ద్వారా చేపట్టిన చెక్‌డ్యాం నిర్మాణ పనులు పరిశీలించారు. చెక్‌డ్యాం నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్ని నెలల పాటు నీరు నిల్వుంటుందని, ఎర్రబోరు, అడవిరామవరం రహదారిపనులను పరిశీలించారు. ఆర్లగూడెంలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని పీవో పరిశీలించి అక్కడ ప్రజలకు అందుతున్న వైద్యసేవల గురించి అడిగితెలుసుకున్నారు. ట్రైకార్‌ ద్వారా స్వయం ఉపాధి యూనిట్లు పొందిన పెనుబల్లి శ్రీను, ఇస్తరాకుల తయారీ యూనిట్‌ను పొందిన పెనుబల్లి గంగరాజు, ట్రాక్టర్‌ పొందిన మర్మం సమ్మయ్య, టెంట్‌హౌస్‌తో పాటు పెళ్ళిళ్ల అలంకరణ యూనిట్లు మంజూరైన లబ్ధిదారులను కలుసుకుని ఆయన వాటికి సంబంధించి అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఇస్తరాకులను బహిరంగ మార్కెట్‌కు సరఫరాచేయడం వల్ల లాభాలు వస్తున్నాయా అనితెలుసుకున్నారు. దీనికి సంబంధించి ఐటీడీఏ ఎన్‌వో సురేష్‌ను అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రేగుబల్లి ఆశ్రమ పాఠశాలను పరిశీలించి విద్యార్థుల సౌకర్యార్ధం అదనపు తరగతి గదుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఈఈని ఆదేశించారు. ఐటీడీఏ ద్వారా నిర్వహిస్తున్న ప్రతి పాఠశాలకు సీసీలు సిద్ధం చేయాలని సూచించారు. ఆయన వెంట ఐటీడీఏ ఈఈ కోటారెడ్డి, ఐబీ అధికారులు, తహశీల్దార్‌ మంగీలాల్‌ ఉన్నారు.

162
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles