నర్సరీల్లో మొక్కలు సంరక్షించుకోవాలి..

Wed,May 15, 2019 01:50 AM

-పలు నర్సరీలను పరిశీలించిన డీఆర్‌డీఏ పీడీ ఇందుమతి
ఖమ్మం రూరల్‌, నమస్తేతెలంగాణ, మే 14 : వన్‌ జీపీ వన్‌ నర్సరీ పథకంలో భాగంగా మండల వ్యాప్తంగా నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను సంరక్షిచుకోవాల్సిన బాధ్యత ఈజీఎస్‌, గ్రామకమిటీలపై ఉందని డీఆర్‌డీఏ పీడీ ఇందుమతి అన్నారు. మంగళవారం రూరల్‌ మండలంలోని దారేడు, జాన్‌బాద్‌తండా, తీర్థాల, గోళ్లపాడు, ఆరెంపుల, పొన్నెకల్లు, తల్లంపాడు, మద్దులపల్లిలో గల నర్సరీలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టార్గెట్‌ ప్రకారం మండలంలోని 8.80 లక్షల మొక్కలను బతికించాలన్నారు. వేసవికాలంలో కష్టపడి మొక్కలను బతికించి వర్షకాలంలో నాటేందుకు సిద్ధంగా ఉంచాలన్నారు. మండలంలోని 23 పంచాయతీల్లో ప్రతి పంచాయతీకి 40వేల చొప్పున మొత్తం 8.80 లక్షల మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. అందుకు గాను మండలంలోని ఆయా గ్రామాల్లోని ఉపాధిశాఖ ఆధ్వర్యంలో 22 నర్సరీల్ల్లో వివిధ రకాల మొక్కలను సిద్ధంగా ఉంచామని, అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీలు పోలేపల్లి, కామంచికల్లు, గోళ్లపాడు, ముత్తగూడెంలో మూడు చొప్పున ఉన్నాయని తెలిపారు. అటవీశాఖ, ఉపాధిహమీ నర్సరీల్లో మొత్తం 12.80 లక్షల మొక్కలు పెంచుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు బాలు, తాటికొండ సుదర్శన్‌, శివారెడ్డి, కళ్లెం వెంకటరెడ్డి, బోజ్యానాయక్‌, ఏపీవో శ్రీదేవి, ఈసీ వెంకట్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు ఉన్నారు.

175
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles