పాలియేటివ్‌ కేంద్రాన్ని సందర్శించిన రాష్ట్ర పీవో బృందం

Wed,May 15, 2019 01:49 AM

మయూరి సెంటర్‌, మే 14: జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో గల పాలియేటివ్‌ అండ్‌ ఎల్డర్లీకేర్‌ సెంటర్‌ను తెలంగాణ రాష్ట్ర ఎన్‌సీడీ ప్రాజెక్టు ఆఫీసర్‌ సత్య ఆధ్వర్యంలో మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు ఆఫీసర్‌ డాక్టర్‌ కోటిరత్నం నేతృత్వంలో ఈ సెంటర్‌లో గల వృద్ధులు, పక్షవాత వ్యాధిగ్రస్తులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు అందుతున్న వైద్యసేవల గురించి అడిగి తెలసుకున్నారు. వయోవద్దుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని, ఈ నెల 2వ తేదీ నుంచి వయోవృద్ధులకు వైద్యసేవలు అందించేందుకు జిల్లా వైద్యశాలలోని 3వ నెంబర్‌ గదిలో అవుట్‌ పేషెంట్‌ సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రాజెక్టు ఆఫీసర్‌ సత్య తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఇంటి వద్దకు వెళ్లి వారి సహాయకులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించి, వారికి వైద్యసేవలను అందించడం జరుగుతుందన్నారు. 8 జిల్లాల్లో ఖమ్మం జిల్లా వయోవృద్ధులకు వైద్యసేవలు అందించే జిల్లాగా గుర్తింపు పొందిందని తెలిపారు. అనంతరం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మాలతి, డాక్టర్‌ కోటిరత్నం మాట్లాడుతూ.. ఇటీవల కామేపల్లి మండలం గోవింద్రాల ప్రాంతంలో వయోవృద్ధులను, అనారోగ్యంతో ఉన్న వారిని గుర్తించి వారికి వైద్యసేవలు అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలియేటివ్‌ వైద్యులు డాక్టర్‌ వందన, ఫిజియోథెరఫి వైద్యుడు అశోక్‌, స్టాప్‌ నర్సులు, ఏఎన్‌ఎంలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

192
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles