1 నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు

Fri,April 26, 2019 12:33 AM

మయూరి సెంటర్: వేసవి సెలవులలో అండర్-18 విభాగంలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో మే 1 నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి పరంధామరెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏటా రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ నేతృత్వంలో జరిగే ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఆసక్తి గల 08-18 వయస్సు గల అభ్యర్థులకు నిర్వహిస్తున్నామన్నారు. సాట్స్ సహకారంతో 10 క్యాంపులను, డీఎస్‌ఏ సహకారంతో 22 క్యాంపులను ఉదయం 6 - 9 గంటల వరకూ, సాయంత్రం 4:30 7:30 గంటల వరకు సర్దార్ పటేల్ స్టేడియంలో సమ్మర్ కోచింగ్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇతర వివరాల కోసం జిల్లా యువజన, క్రీడల కార్యాలయంలో కానీ, లేక 9849913068, 9618718929 అనే ఫోన్ నెంబర్లను గానీ సంప్రదించగలరని సూచించారు.

199
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles