స్థానిక పోరుకు సాంకేతిక సహకారం...

Thu,April 25, 2019 02:58 AM

మామిళ్లగూడెం, ఏప్రిల్ 24 : స్థానిక పోరుకు సాంకేతిక సహకారం తోడవడంతో ఎన్నికల ప్రక్రియ సులభతరమైంది. గతంలో ప్రతీ పనిని నిగూడంగా నిర్వహించే ఎన్నికల కమిషన్ మారిన సాంకేతిక, పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ప్రతీ సమాచారాన్ని పౌరుడికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో సమాచారాన్ని అందుబాటులో ఉంచేందుకు సాంకేతిక సహకారాన్ని వినియోగిస్తున్నారు. సామాన్య పౌరుడు ఎన్నికల నియమనిబంధనలను, అభ్యర్థుల వివరాలను ఏ ఒక్క అధికారి దగ్గరికి వెళ్లి అడకుండానే సమాచారాన్ని తెలుసుకునేందుకు ఎన్నికల అధికారులు ప్రతీ సమాచారాన్ని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నారు. సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన తరువాత ప్రతీ పౌరుడు ప్రభుత్వం, ప్రభుత్వ రంగ, రాజ్యాంగ సంస్థలు నిర్వహించే కార్యకలాపాలను తెలుసుకునేందుకు వీలుగా సాంకేతిక పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుంది. అందులో భాగంగానే ప్రస్తుతం నిర్వహిస్తున్న జిల్లా, మండల ప్రజా పరిషత్ ఎన్నికల సమాచారానికి Te- పోల్ వెబ్‌సైట్ ద్వారా సమాచారాన్ని ప్రజలకు, పోటీ చేస్తున్న అభ్యర్థులకు అందిస్తున్నారు.

వైబ్‌సైట్‌లో వివరాలు...
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ Te- పోల్‌లో సమాచారం అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన వివరాలన్నీ ఒక్క క్లిక్‌తో ప్రజల చేతిలో ఉంగే విధంగా అధికారులు సిద్ధం చేశారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన నియమనిబంధనలతో పాటు అధికారుల బాధ్యతలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. గ్రామాల వారీగా ఓటర్ల జాబితాను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎన్నికలకు సంబంధించిన పనులు ప్రారంభించిన దగ్గర నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీల రిజర్వేషన్లు, దాని నియమనిబంధనలు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న స్థానాలలో ప్రజలకు వెబ్‌సైట్‌లో తెలుసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీని ద్వారా ఎన్నికల కమిషన్ పారదర్శకంగా పని చేస్తుందనే నమ్మకం ప్రజల్లో కనిపించే విధంగా ప్రతీ పనిని ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచడం వల్ల ప్రజలు తెలుసుకుంటారని అధికారులు సాంకేతిక సహకారాన్ని వినియోగిస్తున్నారు. ఓటింగ్ సరళిని తెలుసుకునేందుకు వెబ్‌కాస్టింగ్ ద్వారా ప్రత్యేక వీడియో కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. నిఘాలో భాగంగా వాహనాలను తనిఖీ చేసే సందర్భంలోనూ వీడియోలను చిత్రీకరించి సమాచారాన్ని వెబ్‌సైట్లలో నిక్షిప్తం చేస్తున్నారు.

ఆన్‌లైన్‌లో అభ్యర్థుల నామినేషన్లు...
సాంకేతిక రంగం అందుబాటులోకి రావడంతో అభ్యర్థులు తమ నామినేషన్లు ఆన్‌లైన్ ద్వారా కూడా దాఖలు చేసే వీలును ఎన్నికల కమిషన్ కల్పించింది. ఎన్నికల కమిషన్ ప్రకటించిన తేదీలలో అభ్యర్థులు నామినేషన్లను ఆన్‌లైన్‌లో దాఖలు చేసుకుని ఆ తరువాత హార్డ్‌కాఫీని స్థానిక ఎన్నికల అధికారులకు అందజేస్తే సరిపోతుంది. ఎన్నికలు ముగిసే అంతవరకు రోజువారీగా కోడ్ అమలులో భాగంగా జరుగుతున్న తనిఖీలు, పర్యవేక్షణ ప్రతీరోజు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. ఫలితాల రోజు రౌండ్‌ల వారీగా ఫలితాల వివరాలను ఆయా పార్టీలకు వచ్చిన ఓట్ల వివరాలను ఆన్‌లైన్ ద్వారా తెలుసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. గెలిచిన అభ్యర్థులు, వారు సాధించిన ఓట్లు బూతుల వారీగా ప్రజలకు అందుబాటులో ఉంటాయి. గతంలో చేతిరాతలతో రికార్డులలో ఉండే వివరాలను ఇప్పుడు ప్రజలు ఒక్క క్లిక్‌తో తెలుసుకునే విధంగా సాంకేతిక సహకారాన్ని జోడించి ఎన్నికలకు వినియోగిస్తున్నారు.

248
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles