బొగ్గు టిప్పర్లతో మసక బారుతున్న జీవితాలు

Thu,April 25, 2019 02:54 AM

పెనుబల్లి, ఏప్రిల్ 13 : టిప్పర్ వాలా....హై స్పీడ్ అంటూ బొగ్గు టిప్పర్ ఎక్కిన డ్రైవర్ బండ్లు నడిపే విధానం వల్ల కొందరి జీవితాలు అర్ధాంతరంగా ముగియడం, కొన్ని కుటుంబాలు ఇళ్లు ఖాళీ చేసి వదిలి వెళ్లడం జరుగుతోంది. ప్రతి నిత్యం ఇలా జరుగుతున్నప్పటికీ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో టిప్పర్లు తిరిగే ప్రాంతవాసులు హడలెత్తుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోననే ఆందోళన వాహనదారులు...ఇది పెనుబల్లిలో బొగ్గు టిప్పర్లు తిరిగే ప్రాంతంలో ప్రజల పరిస్థితి. ప్రతీ నిత్యం సత్తుపల్లి నుంచి కొత్తగూడెంకు బొగ్గు టిప్పర్ల ద్వారా వేల టన్నుల బొగ్గు వందల సంఖ్యలో లారీలతో రవాణా జరుగుతోంది. పెనుబల్లి మండలంలోని మండాలపాడు, రామచంద్రరావుబంజరు, వీయంబంజరు, పెనుబల్లి, ఎడ్ల బంజరు, రంగారావు బంజరు, ఉప్పలచలక గ్రామాల మీదుగా సుమారు 40 కిలోమీటర్ల వరకు పెనుబల్లి మండలంలో రవాణా జరుగుతోంది. మండలంలో ఏ రోడ్డు ప్రమాదం జరిగినా కారణం బొగ్గు టిప్పర్లేనని ప్రజలు అంటున్నారు. ఎక్కువ ట్రిప్పుల కోసం టిప్పర్లు హైస్పీడ్‌తో వెళుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, అనుభవం లేని డ్రైవర్లను శిక్షణ లేకుండా వాహనాలను అప్పగించడం వల్ల వారు ప్రజలతో ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనేది ప్రజల ఆరోపణ.

తక్కువ సమయంలో ఎక్కువ బొగ్గు రవాణా చేయాలనే యజమాన్యాల ఆదేశాల మేరకు డ్రైవర్లు ఎక్కువ ట్రిప్పులు వేయడానికి వాహనాలను వేగంగా నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ రహదారిలో ఎక్కువ మలుపులు ఉండటం, సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, జాతీయ రహదారి కూడలిలో ఉన్న వీయం బంజరులో బొగ్గు రవాణాకు టిప్పర్ల వల్ల అనేక మంది మృత్యువాత పడుతున్నారు. లోడుపైన పూర్తిస్థాయిలో పట్టాలు కప్పాల్సి ఉండగా సగం వరకే కప్పడం వల్ల ఈ వాహనాల వెనుక నుంచి వచ్చే ద్విచక్రవాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. రహదారి పక్కన ఇళ్ళల్లోకి బొగ్గు పొడి వెళ్ళడం వల్ల స్థానికులు రోగాల పాలవుతున్నామని వాపోతున్నారు. బొగ్గు టిప్పర్ల కాలుష్యం వల్ల లక్షలతో నిర్మించుకున్న ఇళ్ళను తరుచూ శుభ్రం చేయలేక ఇంటిని వదిలి అద్దె ఇళ్ళల్లో ఉండాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాద వార్త వినాల్సి వస్తుందోనని బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వస్తుంది. బొగ్గు రవాణా చేసే క్రమంలో నియయనిబంధనలు పాటించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

197
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles