ఏజెన్సీ ధ్రువీకరణ పత్రాలు జారీలో జాప్యం చేయొద్దు

Thu,April 25, 2019 02:53 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ ఏప్రిల్ 24 : అర్హులైన గిరిజనులకు ఏజెన్సీ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంలో జాప్యం చేయవద్దని భద్రాచలం ఐటీడీఏ పీవో వీపీ గౌతమ్ అన్నారు. బుధవారం స్థానిక ఐటీడీఏ సమావేశపు హాలులో ఏజెన్సీ ధ్రువీకరణ పత్రాలు, ఎల్టీఆర్ కేసులు తదితర అంశాలపై పీవో తహసీల్దార్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీవో మాట్లాడుతూ... గిరిజనులు ఏజెన్సీ ధ్రువీకరణ పత్రాలు జారీ కోసం దరఖాస్తులు చేసుకున్నట్లయితే 15రోజుల్లో వారికి సంబంధిత పత్రాలు జారీ చేయాలన్నారు. జారీ చేయడబడిన పత్రాలకు సంబంధించి ప్రతీ తహసీల్దార్ కార్యాలయంలో అభ్యర్థి యొక్క పూర్తి సమాచారాన్ని రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల సాధన సమయంలో విద్యార్థులు ఏజెన్సీ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తులు చేసుకుంటారని, నిర్ణీత వ్యవధిలోనే అందజేసినట్లయితే వారు ప్రభుత్వ ఉద్యోగం సాధించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ఏజెన్సీ ధ్రువీకరణ పత్రాల జారీ అన్ని వేళల్లో జరగాలని, అవసరమైతే ప్రత్యేకంగా క్యాంప్‌లు నిర్వహించి అభ్యర్థులకు పత్రాలు జారీ చేయాలని సూచించారు.

మండలాల వారీగా ఇప్పటి వరకు జారీ చేసిన ఏజెన్సీ ధ్రువీకరణ పత్రాల జాబితాను సబ్‌కలెక్టర్, ఆర్డీవోలతో పాటు తనకు కూడా పంపాలని తహసీల్దార్‌లను పీవో ఆదేశించారు. ఏజెన్సీ ధ్రువీకరణ పత్రాలు జారీ కోసం ప్రభుత్వ ఉత్తర్వులు నెం.24 ప్రకారం అందరూ తహసీల్దార్‌లకు ఉపయోగపడే విధంగా బుక్‌లెట్ ప్రింట్ చేసి తహసీల్దార్‌లకు అందజేయనున్నట్లు వివరించారు. ఏజెన్సీ ధ్రువీకరణ పత్రాల జారీ కోసం వచ్చిన దరఖాస్తులను రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లుతో విచారణ నిర్వహించి అందజేసిన ఫైల్‌ను తహసీల్దార్‌లు నిశితంగా పరిశీలన చేసిన తదుపరి జారీ చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో సమగ్రంగా విచారణ నిర్వహించిన తదుపరి మాత్రమే జారీ చేయాలని సూచించారు. ఏజెన్సీ ధ్రువీకరణ పత్రం జారీ కోసం అభ్యర్థి చేసిన దరఖాస్తులను పరిశీలించిన తదుపరి సక్రమంగా లేనట్లయితే అందుకు గల కారణాలను అభ్యర్థికి తెలియజేస్తూ సంబంధిత ప్రతిని సబ్‌కలెక్టర్, ఆర్‌డీవోలకు పంపుతూ తనకు ఒక ప్రతిని పంపాలని పీవో తహసీల్దార్‌లకు సూచించారు. సమావేశంలో భద్రాచలం సబ్‌కలెక్టర్ భవేష్‌మిశ్రా, కొత్తగూడెం ఆర్‌డీవో స్వర్ణలత, ఏపీవో జనరల్ భీమ్‌రావు, ఆర్‌వోఎఫ్‌ఆర్ డీటీ తహసీల్దార్ శ్రీనివాసరావుతో పాటు అన్ని మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

భూమి హక్కు పత్రాల దరఖాస్తుల జాబితా అందజేయాలి
భూమి హక్కు పత్రాలు జారీ కోసం వచ్చిన దరఖాస్తుల జాబితాను అందజేయాలని ఐటీడీఏ పీవో వీపీ గౌతమ్ రెవెన్యూ, అటవీశాఖ అధికారులను ఆదేశించారు. భూమి హక్కు పత్రాల జారీ కోసం వచ్చిన దరఖాస్తుల్లో 30వేల దరఖాస్తులను తిరస్కరించినట్లు చెప్పారు. తిరస్కరించబడిన దరఖాస్తులకు సంబంధిత రెవెన్యూ, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా పరిశీలన చేసి తిరస్కరించుటకు గల కారణాలను తెలియజేస్తూ నివేధికలు అందజేయాలన్నారు. తిరస్కరణ అనంతరం ఉన్న దరఖాస్తులు ఆధారంగా తక్షణం సర్వే నిర్వహించి అర్హులు, రిజెక్టట్ జాబితాను పంపాలన్నారు. రెవెన్యూ, అటవీశాఖ అధికారులు వారంలో మండలస్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి తిరస్కరణకు గురైన దరఖాస్తులను తిరిగి పునఃపరిశీలన చేయాలని తెలిపారు. భూమి హక్కు పత్రాలు పొందిన కొంత మంది గిరిజన రైతులకు రైతుబంధు పథకం వర్తింపచేయలేదని అట్టి జాబితాను పరిశీలన చేసి, రైతుబంధు వర్తింపచేయకపోవడానికి గల కారణాలను తెలియజేస్తూ తనకు జాబితా పంపాలన్నారు. రెవెన్యూ, అటవీశాఖ అధికారులు ఒక వెయ్యి దరఖాస్తులు సమగ్రంగా ఉన్నట్లు నిర్ధారించి అందజేసిన జాబితాను జిల్లాస్థాయి కమిటీలో ఆమోదం కోసం సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను పీవో ఆదేశించారు.

190
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles