మందకొడిగా నామినేషన్లు

Wed,April 24, 2019 01:35 AM

మామిళ్లగూడెం, ఏప్రిల్ 23: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలల్లో భాగంగా మంగళవారం మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల కార్యక్రమం మందకోడిగా సాగింది. రెండోవ రోజు మంగళవారం కావడంతో పాటు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో మండలాల్లో నామినేషన్ల కోలాహాలం కనిపించలేదు. మొదటి విడత ఎన్నికల్లో ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ, కామేపల్లి, సింగరేణి ఏడు మండలాల్లో అధికారులు నామినేషన్లను స్వీకరించారు. తొలి విడత ఎన్నికలకు రోండోవ రోజు నామినేషన్ల దాఖాలుకు అభ్యర్థులు ఎవరు పెద్దగా ఆసక్తి చూపలేదు. జిల్లా వ్యాప్తంగా ఏడు మండలాల పరిధిలో ఏడు జడ్పీటీసీ స్థానాలకు 4 నామినేషన్లు మాత్రమే అభ్యర్థులు అధికారులకు అందించారు. అలాగే ఏడు మండలాల్లో ఉన్న 112 ఎంపీటీసీలకు కేవలం 42 నామినేషన్లు మాత్రమే అభ్యర్థులు తమ నామినేషన్ల పత్రాలు అధికారులకు అందించారు. జిల్లా పరిషత్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఏడు మండలాల్లో జడ్పీటీసీలకు కామేపల్లి-1, కూసుమంచి-1, నేలకొండపల్లి-1, తిరుమలాయపాలెం-1మండలాలలో నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రెండోరోజు కూడా ఖమ్మం రూరల్, ముదిగొండ, సింగరేణి జడ్పీటీసీ స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా రా లేదు. అదే విధంగా ఎంపీటీసీలకు కామేపల్లి-7, ఖమ్మం రూ రల్-1, కూసుమంచి-11, ముదిగొండ -6, నేలకొండపల్లి-1, సింగరేణి-11, తిరుమలాయపాలెం-5 నామినేషన్లు దాఖాలయ్యాయి. మొత్తంగా రెండురోజుల్లో జడ్పీటీసీ స్థానాలకు ఏడు మండలాలలో ఏడే నామినేషన్లు వచ్చాయి. ఏడు మండలాలలోని రెండు రోజులకు ఎంపీటీసీ స్థానాలకు 54 నామినేషన్లు దాఖాలయ్యాయి. రెండో రోజు జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ దాఖాలైన వాటిలో టీఆర్‌ఎస్-1, కాంగ్రే సు-1, సీపీఎం-1 నామినేషన్ పత్రాలు అధికారులకు అం దించారు. అలాగే ఏడు మండలాలలో ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్-18, కాంగ్రేస్-16, సీపీఎం-10, బీజేపీ-1, టీడీ పీ-1, తమ నామినేషన్లను అభ్యర్థులతో వేయించాయి. నా మినేషన్ పత్రాలు దాఖలుకు నేటితో గడువు ముగియనుండడంతో ప్రధాన పార్టీల నుంచి అన్ని మండలాల్లో భారీగా నా మినేషన్లు వేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

200
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles