సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌కు రక్ష

Wed,April 24, 2019 01:34 AM

-టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రవణ్‌రెడ్డి
బయ్యారం టీడీపీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి టీఆర్‌ఎస్ లో చేరిక
బయ్యారం, ఏప్రిల్ 23 : సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్ పార్టీకి రక్ష అని టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రవణ్‌రెడ్డి ,మాలోత్ కవితలు అన్నారు. ఇల్లందు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ సమక్షంలో టీడీపీ మండల అధ్యక్షుడు తాత గణేష్ , కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి గంగుల సత్యనారాయణలు మంగళవారం టీఆర్‌ఎస్ పార్టీలో చేరగా వారికి కండవా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అందిస్తున్న జన రంజక పాలన పట్ల ప్రజలు ఎంతో సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. అందువల్లనే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని అందించగా ఎంపీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుచుకోనుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తాయన్నారు. రాష్ట్రంలోని అమలవుతున్న పలు సంక్షేమ పథకాలు వివిధ రాష్ర్టాలకు ఆదర్శంగా మారి అమలు చేస్తున్నారని, రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. ఎంపీటీసీ , జడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సత్త చాటాలని అందుకోసం ప్రతీ కార్యకర్త కృషి చేయాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విథంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్న ఘనత కేవలం టీఆర్‌ఎస్‌దే నని, ప్రతి కార్యకర్త సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకవెళ్ళాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకుడు హరిసింగ్ నాయక్, మండల అధ్యక్షుడు మూల మధుకర్‌రెడ్డి, నాయకులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

189
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles