బెట్టింగ్ రాయుళ్ల గుట్టురట్టు..!

Mon,April 22, 2019 11:34 PM

కొత్తగూడెం క్రైం, ఏప్రిల్ 22 : ఐపీఎల్ క్రికెట్ ముసుగులో బెట్టింగ్ నిర్వహిస్తున్న జూదరుల గుట్టురట్టు చేశారు కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసులు. ఈ సదర్భంగా సోమవారం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ లింగనబోయిన ఆదినారాయణ వివరాలను వెల్లడించారు.. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ను ఆసరాగా చేసుకుని లీడ్‌లో ఉన్న టీమ్‌ల పేరుతో జూదం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. కూలీలైన్ ఏరియాకు చెందిన ముత్తయ్య శంకర్ అనే వ్యక్తి ఈ జూదాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం తేలుసుకున్న పోలీసులు అతని ఇంటిపై ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ క్రమంలో శంకర్‌తో పాటు జూదమాడుతున్న తొమ్మిది మంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో కేటీపీఎస్ ఉద్యోగి మిట్టపల్లి శ్రీనివాస్, కూలీలైన్‌కు చెందిన కొక్కుల బుచ్చి రాములు, కూరగాయల వ్యాపారి బండ రవి, బండ సత్యనారాయణ, సెల్‌పాయింట్ వ్యాపారి శ్రీరాముల శివ కిరణ్, కూరగాయల వ్యాపారి పాటిబండ్ల జనార్ధన్, కూలీలైన్‌కు చెందిన ఎం.డీ. ఉస్మాన్, గాజులరాజం బస్తీకి చెందిన రాగి రాజు, మధురబస్తీకి చెందిన జనగామ సత్యనారయణలు ఉన్నారు. వీరి వద్ద నుంచి రూ.82,500 నగదుతో పాటు 9సెల్‌ఫోన్లను స్వాధీనపరుచుకున్నారు. జూదం నిర్వహించే శంకర్‌పై గతంలో కూడా ఐపీఎల్ బెట్టింగ్ కేసులు ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సైలు బి. శ్రీనివాసరావు, విద్యాసాగర్ రెడ్డి, పీఎస్సై అనూష, పోలీస్ పీఆర్‌వో దాములూరి శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ జె. సుబ్బారావు, కానిస్టేబుళ్లు రాములు, రాంబాబు పాల్గొన్నారు.

259
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles