రెండు పూరిళ్లు దగ్ధం

Mon,April 22, 2019 01:20 AM

-రూ.2.82 లక్షల ఆస్తి నష్టం
చండ్రుగొండ, ఏప్రిల్ 21 : పిడుగుపాటుకు పూరిల్లు దగ్ధమైన సంఘటన ఆదివారం మండలంలో వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి...ఇమ్మడిరామయ్య బంజర గ్రామానికి చెందిన జోనెబోయిన నాగేశ్వరరావు ఇంటి ఆవరణలో గల కొబ్బరి చెట్టుపై శనివారం అర్ధరాత్రి అకస్మాత్తుగా పిడుగుపడటంతో మంటలు వ్యాపించి, పక్కనే గల పూరిల్లుకు మంటలు అంటకున్నాయి. దీంతో ఇంట్లో గల నాగేశ్వరరావు, అతని కుటుంబ సభ్యులు అకస్మాత్తుగా తేరుకొని కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. దీంతో పూరిల్లుకు మంటలు ఒక్కసారిగా వ్యాపించి కాలిపోయింది. ఇంటి పక్కనే గల రామక్రిష్ణ గడ్డి వాముకి మంటలు వ్యాపించటంతో నాలుగు ఎకరాలు గడ్డివాము సైతం కాలిపోయింది. కొత్తగూడెం ఫైర్‌స్టేషన్ వాహనం సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ఈ ప్రమాందంలో రూ.2క్షల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. వీఆర్‌ఓ రమేష్ సంఘటన స్థలానికి చేరుకొని, పంచనామా నిర్వహించారు.

దమ్మపేటలో..
దమ్మపేట : ప్రమాదవశాత్తు షార్ట్‌సర్క్యూట్ జరిగి ఓ పూరిల్లు దగ్ధమైన సంఘటన మండల పరిధిలోని ముకుందాపురం గ్రామంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ముకుందాపురం గ్రామంలో దారా నర్సింహారావుకు చెందిన పూరిల్లు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒక్కసారిగా షార్ట్‌సర్క్యూట్ జరిగి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు పూరిల్లుకు అంటుకోవడంతో ఇంట్లో ఉన్న సామాగ్రి, నగదు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న ఆర్‌ఐ భిక్షమయ్య సంఘటనా స్థలానికి చేరుకుని నష్టాన్ని అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదిక అందజేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.82వేలు ఆస్తినష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు.

237
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles