ఘనంగా భద్రాద్రి రామయ్య నిత్యకల్యాణం

Mon,April 22, 2019 01:20 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ: పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం అర్చకులు గోదావరినది నుంచి తీర్థబిందెను తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేశారు. తదుపరి ఆరాధన, అర్చన, సేవాకాలం, నివేదన తదితర పూజలు గావించారు. భక్తులు అధిక సంఖ్యలో భద్రాచలం తరలివచ్చి పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. రామాలయానికి చేరుకొని రామున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ఉన్న శ్రీలక్ష్మీతాయారు అమ్మవారిని, అభయాంజనేయ స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. రుష్యమూక మ్యూజియాన్ని సందర్శించి సీతమ్మవారి నగలను తిలకించారు. అనంతరం అర్చకులు ఆలయంలోని బేడా మండపంలో రామయ్యస్వామికి ఘనంగా నిత్యకల్యాణం నిర్వహించారు. భక్తులు కల్యాణంలో పాల్గొని తిలకించి పునీతులయ్యారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

225
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles