పరిషత్ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలి..

Mon,April 22, 2019 01:19 AM

ఖమ్మం, నమస్తేతెలంగాణ: జిల్లాలో మూడు దశల్లో జరుగనున్న జిల్లా, మండల పరిషత్ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ అన్నారు. ఆదివారం టీటీడీసీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో మే 6,10,14 తేదీలలో మూడు విడతలుగా జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలకనుగుణంగా నియమ నిబంధనలపై సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలన్నారు. శిక్షణ తరగతుల ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. మూడు దశల్లోనూ నామినేషన్ల ప్రకియ మొదలలకొని ఫలితాలు వెల్లడించే వరకు ఎన్నికల విధులకు కేటాయించిన అధికారులు, సిబ్బంది తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు.

మాస్టర్ ట్రైనర్స్ సత్యనారాయణ, నాగిరెడ్డి రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల నిర్వహణపై సమగ్ర అవగాహన కల్పించారు. జిల్లాలో శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసుకున్నామని, అదేస్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య ప్రణాళిక అధికారి ప్రియాంక, జిల్లాస్థాయి నోడల్ అధికారులు బి,ప్రవీణ, కె.శ్రీనివాసరెడ్డి, శిరీష, ఇందుమతి, ఎక్స్‌పెండీచర్ అబ్జర్వర్ పి.కృపాకర్‌రావు, స్వీప్ నోడల్ అధికారి కె.శ్రీరామ్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

229
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles