వృత్తి విద్యా కోర్సులను సద్వినియోగం చేసుకోవాలి

Wed,April 17, 2019 01:01 AM

-జిల్లా మహిళా ప్రాంగణాధికారి వేల్పుల విజేత
మయూరిసెంటర్, ఏప్రిల్16: మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న వృత్తి విద్యా కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ వేల్పుల విజేత అన్నారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ వివిధ రంగాలలో వృత్తివిద్యా కోర్సులలో శిక్షణ ఇస్తున్నామని, మహిళలు కూడా అన్ని రంగాలలో ముందుండాలని ఆమె కోరారు. నేటి ఆధునిక సమాజంలో ఆడపిల్లల్లో ఆత్మైస్థెర్యం నింపడానికి ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడతాయని ఆమె పేర్కొన్నారు. తల్లి తండ్రులకు చేదోడు వాదోడుగా ఉండటానికి ప్రతి ఆడ పిల్ల తన కాళ్లపై తను నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లా మహిళా ప్రాంగణంలో ఇప్పటి వరకు వివిధ రకాల రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఇచ్చామని, ఇందులో భాగంగా ఈ వేసవిలో వివిధ రకాల రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ ట్రైనింగ్స్ ప్రారంభించనున్నామని తెలిపారు. ప్రారంభం కానున్న కోర్సులలో భాగంగా జిల్లా కేంద్రంలోని మహిళా ప్రాంగణంలో 1) స్పోకెన్ ఇంగ్లీషు, 2) టైపింగ్, 3) ట్యాలీ అకౌంటింగ్, 4) కంప్యూటర్ (డీసీఏ), 5) కంప్యూటర్ (డీటీపీ), 6) ఉమెన్ డ్రైవింగ్, 7) టైలరింగ్, 8)బ్యూటీషియన్, 9) మగ్గం వర్క్స్ కోర్సులున్నాయని వివరించారు. ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు పైన తెలిపిన శిక్షణలు పొందేందుకు వెంటనే మహిళా ప్రాంగణంలో సంప్రదించి ఈనెల 20వ తేదీ లోగా దరఖాస్తులు అందజేయాలని, ఈ అవకాశాన్ని ప్రతీఒక్కరు వినియోగించు కోవాలని ఆమె కోరారు. దరఖాస్తులు చేసుకొనువారు వారి యొక్క ఆధార్ కార్డ్, కుల, ఆదాయ ధ్రువీకరణ, విద్యార్హతల సర్టిఫికెట్ జీరాక్స్ కాపీలను వారియొక్క దరఖాస్తులకు జతపరచాలన్నారు. ఇతర వివరాలకు స్థానిక జిల్లా మహిళా ప్రాంగణ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

258
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles