సీతారాంపురం ఇసుక ర్యాంపు పరిశీలన

Wed,April 17, 2019 01:01 AM

ములకలపల్లి, ఏప్రిల్ 16: మండలంలోని సీతారాంపురం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గుర్రాలకుంట వద్ద నిర్వహిస్తున్న ఇసుక ర్యాంపును త్రిసభ్య కమిటీ సభ్యుల బృందం మంగళవారం సందర్శించి తనిఖీ చేశారు. గుర్రాలకుంట ఇసుకర్యాంపులో అక్రమాలు జరుగుతున్నాయని, ఇసుక నిల్వలు లేకపోయినప్పటికీ చుట్టుపక్కల ఇసుకను తీసుకువచ్చి ముర్రేడు వాగు ఇసుకగా చూపుతూ రవాణా చేస్తున్నారని, దీనివల్ల భూగర్భజలాలు అడుగంటుతున్నాయని, స్థానికంగా కొందరు గిరిజన రైతులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ హైకోర్టు ఆదేశాల మేరకు మైనింగ్, పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆ బృందం సభ్యులు ఇసుకర్యాంపు, వాగును పరిశీలించి స్థానిక గిరిజన రైతులు, కూలీలతో మాట్లాడారు. ఈ బృందంలో పాల్వంచ డీఎస్పీ మధుసూదన్‌రావు, సీఐ మడత రమేష్, మైనింగ్ ఏడీ గంగాధర్‌రావు, ఆర్డీవో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ మధు, స్థానిక ఆర్‌ఐ మధుతో పాటు పంచాయతీరాజ్, రెవెన్యూశాఖలకు చెందిన అధికారులు ఉన్నారు.

243
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles