ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

Wed,April 17, 2019 01:01 AM

బోనకల్లు, ఏప్రిల్16: వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలు తీసిన సంఘటన మండలంలోని మోటమర్రి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. మోటమర్రి గ్రామానికి చెందిన మరీదు ఉపేంద్ర (37) ఇదే గ్రామానికి చెందిన చిట్టిమోదు విష్ణు భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. గతంలో ఈ విషయమై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సందర్భం ఉన్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం చిట్టిమోదు విష్ణు పొలం పనులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి రావడంతో అతని భార్య, మరీదు ఉపేంద్ర కలిసి ఉండడాన్ని గమనించాడు. దీంతో కోపోద్రుక్తుడై ముంజకాయలు కోసే కత్తితో అతనిని నరికి హతమార్చాడు. వెంటనే నిందితుడు ఇంటికి తాళం వేసి భార్యతో కలిసి పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న మధిర సీఐ వేణుమాధవ్ తాళం వేసిన ఇంటికి వెళ్లి పరిశీలించారు. మృతుడు ఉపేంద్ర రక్తపుమడుగుల్లో పడి ఉండడాన్ని గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్లు సీఐ తెలిపారు.

219
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles