చెడు స్నేహంతో చెరసాలపాలు...

Wed,April 17, 2019 01:01 AM

-ఇండేన్ గ్యాస్ చోరీ కేసు చేధించిన పోలీసులు
-నిందితుల అరెస్టు.. నగదు స్వాధీనం
కొత్తగూడెం క్రైం, ఏప్రిల్ 16: చెడువ్యసనాలకు అలవాటు పడి.. అడ్డదారిలో సంపాదించాలనుకున్నారు.. నిండా 18ఏళ్లు నిండక ముందే.. ఆ బాలుడి బుద్ధ వక్రీకరించింది.. చెడు సావాసాలు ఆ బాలుడిని తప్పుదారి పట్టించాయి.. చిన్నతనంలోనే చోరీలు చేయాలనే దురాలోచనలు కల్పించాయి.. తన స్నేహితుడితో కలిసి అనుకున్నంత పని చేసి.. చివరికి పోలీసులకు పట్టుబడి చెరసాల పాలయ్యారు.. ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయంలో చోరీకి పాల్పడిన ఓ బాలుడితో పాటు, ఓ యువకుడిని త్రీ టౌన్ పోసలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం డీఎస్పీ ఎస్‌ఎం అలీ త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పట్టణంలోని గాజులరాజం బస్తీకి చెందిన ఓ మైనర్ బాలుడు నెహ్రుబస్తీకి చెందిన తన స్నేహితుడితో కలిసి ఈ నెల 5వ తేదీన ఇండేన్ గ్యాస్ కార్యాలయం తాళాలు పగులగొట్టి రూ.5లక్షలు అపహరించారు.

చోరీకి పాల్పడిన అనంతరం వారు పాల్వంచ, హైదరాబాద్, తణుకు, వైజాగ్ ప్రాంతాలల్లో తిరిగి జల్సాలు చేశారు. ఈ చోరీ కేసుపై సీసీ కెమేరాల ఆధారంగా త్రీ టౌన్ ఇన్స్‌పెక్టర్ లింగనబోయిన ఆదినారాయణ నేతృత్వం లో సిబ్బంది ఇన్వెస్టిగేషన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక కూలీలైన్ సమీపంలో ని ఎన్‌టీఆర్ విగ్రహం వద్ద బాలుడు, మరో యువకుడు అనుమానస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ఈ విచారణలో వారు ఇండేన్ గ్యాస్ సత్యషీల ఏజెన్సీలో చోరీకి పాల్పడినట్లు వెల్లడయ్యింది. అపహరణ సొత్తు నుంచి రూ.4.41లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ అలీ తెలిపారు. ఈ చోరీ కేసును త్వరితగతిన చేధించిన త్రీ టౌన్ ఇన్స్‌పెక్టర్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో సీఐ ఆదినారాయణ, ఎస్సైలు శ్రీనివాసరావు, అనూష, హెడ్ కానిస్టేబుళ్లు జే సుబ్బారావు, రఘు, కానిస్టేబుళ్లు రాంబాబు, రాములు పాల్గొన్నారు.

252
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles