ప్రశాంతంగా పాలిసెట్....

Wed,April 17, 2019 01:00 AM

ఖమ్మం ఎడ్యుకేషన్: పదో తరగతి అనంతరం పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన పాలిసెట్ ప్రవేశ పరీక్ష మంగళవారం నిర్వహించారు. ఖమ్మం నగరంలోని 10 కేంద్రాల్లో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 4,648 మంది విద్యార్థ్ధులు దరఖాస్తు చేసుకోగా 162 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రాల్లోకి అనుమతించేది లేదని అధికారులు ప్రకటన చేయడంతో విద్యార్థులు ఉదయం 10 గంటలకల్లా కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు కోఆర్డినేటర్, ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రమణ తెలిపారు.

తనిఖీ చేసిన అబ్జర్వర్..
టెక్నికల్ కోర్సు అయిన పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షను కొత్తగూడెం మైనింగ్ కళాశాల నుంచి స్పెషల్ అబ్జర్వర్‌గా కర్ణకుమార్ జిల్లాలోని పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షలు జరుగుతున్న తీరును, విద్యార్థ్ధుల సీటింగ్ అలాట్‌మెంట్‌ను, నిర్వాహణ తదితర అంశాలపై 10 కేంద్రాలను పరిశీలించారు. స్పెషల్ అబ్జర్వర్‌తో మధిర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుంచి వినోద్, ఎస్‌అర్ అండ్ బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ తదితరులున్నారు. కేంద్రాల వద్ద పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

డిమాండ్...ఆకర్షణ..
జిల్లాలో పాలిటెక్నిక్ కోర్సులు ఇంజనీరింగ్ కళాశాలలకు అనుబంధంగా మాత్రమే ఉన్నాయి. ప్రత్యేకంగా ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలు లేవు. మధిర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అందుబాటులో ఉంది. జిల్లాలోని ఎనిమిది ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కళాశాలల్లో పాలిటెక్నిక్ కోర్సులు ఉన్నాయి. గతంతో పోలిస్తే జిల్లాలో ఉన్న పాలిసెట్ సీట్ల సంఖ్య ఈ విద్యాసంవత్సరం తగ్గనుంది. ఇటీవల ఆయా డిప్లోమా కళాశాలల్లో తనిఖీలు చేసి ప్రమాణాల ఆధారంగా సీట్లు తగ్గించి అనుమతులు ఇవ్వనున్నట్లు విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ఈనేపథ్యంలో విద్యార్థుల సంఖ్య పెరగడం, సీట్ల సంఖ్య తగ్గిన ప్రవేశ పరీక్ష జరిగిన కేంద్రాల వద్ద కళాశాలలు తమ ప్రచార పత్రాలతో హోరెత్తించారు. తమ కరపత్రాలను పంచుతూ కళాశాలలో చేరాలని అభ్యర్థ్ధించారు.

205
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles