ఆనందంలో అన్నదాతలు..

Tue,April 16, 2019 02:26 AM

- పత్తి పంటకు క్వింటా గరిష్ట ధర రూ.6,250
- రూ.9,702 కు చేరుకున్న మిర్చి ధర

ఖమ్మం వ్యవసాయం : ఈ ఏడాది మిర్చి, పత్తి పంటలకు మార్కెట్‌లో మంచి ధరలు పలుకుతన్నాయి. దీంతో రైతులు ఆనందంగా ఉన్నారు. గత సంవత్సరం పత్తి పంటకు మద్దతు ధర క్వింటాకు ఒక్కంటికి రూ.4,300 కాగా, ఈ సంవత్సరం రూ.11 వందలు పెరిగింది. దీంతో కనీస మద్దతు క్వింటాకు ఒక్కంటికి రూ.5,400 ధర నిర్ణయించి భారత పత్తి సంస్థ కొనుగోలు చేసింది. అయితే జాతీయ మార్కెట్లో పత్తికి, పత్తిగింజలకు డిమాండ్ ఉండటంతో ప్రైవేట్ వ్యాపారులు సైతం పోటిపడి కొనుగోళ్లు చేపట్టారు. సీసీఐ కంటే ప్రైవేట్‌లోనే ఎక్కువ ధర వస్తుండటంతో రైతులు సీసీఐ కేంద్రాలకు అమ్మడంలేదు. సోమవారం నగర వ్యవసాయ మార్కెట్లో జరిగిన ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో పత్తికి గరిష్ట ధర క్వింటాకు రూ.6,250 పలికింది. మధ్య ధర రూ.6,200 కాగా, కనిష్ట ధర రూ.4,900 పలికింది. పత్తిపంటతో పాటు మిర్చిపంట మంచి రేటు పలుకుతోంది. పక్షం రోజుల వరకు క్వింటా రూ.9వేల లోపే పలికింది. సోమవారం జెండా పాటలో మిర్చికి క్వింటా రూ.9,702 పలకడం విశేషం. సోమవారం మార్కెట్‌కు దాదాపు 35వేల మిర్చి భస్తాలను వివిద జిల్లాల నుంచి రైతులు తీసుకువచ్చారు. కనిష్ట ధర రూ. 7,300 కాగా మధ్య ధర రూ.8,800 పలికింది. అదే విధంగా తాలు రకం పంటకు క్వింటాకు గరిష్ట ధర రూ 4వేలు పలుకగా, కనిష్ట ధర రూ.4వేలు పలికింది. మధ్యధర రూ.3,500 నిర్ణయించి ఖరీదుదారులు పంటను కొనుగోలు చేశారు.

317
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles