ముత్తారంలో ఘనంగా శ్రీరామ పట్టాభిషేకం..

Tue,April 16, 2019 02:25 AM

ముదిగొండ: ముదిగొండ మండల పరిధిలోని ముత్తరం గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి పట్టాభిషేకం ఘనంగా నిర్వహిచారు. అర్చకులు బొర్రా వాసుదేవాచార్యులు, బొర్రా శ్రీనివాసాచార్యలు, ఇతర అర్చకులచే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో బాగంగా సోమవారం నిత్యహోమం, బలిహరణ నిర్వహించారు. అనంతరం స్వామివారి పట్టాభిషేకం గావించారు. ఈ మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తిలకించారు. ఈ కార్యక్రమంలో సీఎం సీపీఆర్వో వనం జ్వాలా నర్సిహారావు, వంశపారంపర్య ధర్మకర్త వనం వెంకట నాగేశ్వరరావు, ఆలయ చైర్మన్ వనం నరహరిరావు గ్రామ సర్పంచ్ తాళ్ల నాగయ్య, క్రిష్ణాపురం సర్పంచ్ సర్పంచ్ రమాదేవి, మాజీ సర్పంచ్ తుపాకుల యలగొండస్వామి, ముండ్ర అప్పారు, గోపాలరావు పాల్గొన్నారు.

237
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles