కల్యాణ వైభవం

Mon,April 15, 2019 01:20 AM

-తిలకించి పులకించిన భక్త జనం
- పట్టువస్ర్తాలు సమర్పించిన దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
-కల్యాణానికి హాజరైన పలువురు ప్రముఖులు
-నేడు శ్రీరామ పట్టాభిషేకం, రాష్ట్ర గవర్నర్ రాక
భద్రాచలం, నమస్తే తెలంగాణ: భద్రాచలంలో ఆదివారం శ్రీ సీతారాముల కల్యాణం కనుల పండువగా జరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తులు రాము లోరి కల్యాణ్యాన్ని వీక్షించి తరించారు. తొలుత భద్రాద్రి రామునికి దేవాలయంలో ధ్రువమూర్తుల కల్యాణం చేశారు. తర్వాత మంగళవాయిద్యాలు మారుమోగుతుండగా....భక్తుల జయజయ ధ్వానాల మధ్య పల్లకీలో కల్యాణ మండపానికి స్వామివారు తీసుకొచ్చారు. ముందుగా తిరుకల్యాణానికి సంకల్పం చేసి సర్వ విజ్ఞాన శాంతికై విశ్వక్సేణ పూజ నిర్వ హించారు. విష్ణు సంబంధమైన అన్నీ పూజా శుభ కార్యక్రమాలకు విశ్వక్సేణున్ని పూజ చేయ డం ఆనవాయితీ. ఈ తంతు జరిగాక పుణ్యఃవచనం చేశారు. మంత్ర పూజలలో కల్యాణానికి వినియోగించే సకల సామాగ్రిని ప్రోక్షణ నిర్వహించారు. ఆ తర్వాత రక్షా బంధనం, మోక్షబంధనం నిర్వహించారు. 24 అంగుళాల పొడవుగల 12దర్భాలతో అల్లిన ఒక దర్భతాడును సీతమ్మవారి నడుముకు బిగించారు. మాత్రావాహితమైన ఈ మోక్రమును ధరించినట్లయితే ఉదర సం బంధమైన అన్ని రోగాలు నశించి స్త్రీలు సంతానవతులవుతారని అర్చక స్వా ములు భక్తులకు ఈ సందర్భంగా వివరించారు.

రామయ్య కుడిచేతికి, సీతమ్మకు ఎడమ చేతికి రక్షాసూత్రాలు తొడిగి, స్వామి గృహస్థాశ్రమసిద్ధికోసం సువర్ణ యజ్ఞోపవితాన్ని ధరింపచేశారు. గోదానం చేసి మహాసంకల్పం పఠించారు. సాక్షాత్ విష్ణుస్వరూపుడైన శ్రీరామునికి శ్రీ మహాలక్ష్మీ స్వరూపమైన సీతను జగత్కల్యాణార్థం మంత్రధార పూర్వకంగా ఈ కన్యాదానం చేశారు. కన్యాదానం సాద్గుణ్యం కోసం గో, భూహిరణ్య మొదలైన షోడషమహాదానాలు కూడా సమర్పించారు. తరువాత మంగళాష్టకాలు పఠించారు. తరువాత సీతారాముల కల్యాణ వైభవాన్ని చాటిచెప్పే రూపం చుర్గిక పఠించారు. మంగళ వాయిద్యాలు మారుమోగుతుండగా....వేద మంత్రాల మధ్య అభిజిత్‌లగ్నం సమీపించగానే జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచారు. ఇది శుభలగ్నం. ఈ జీలకర్ర, బెల్లం శిరస్సుపై ఉంచితే మనలో సత్యం, సద్భావనము పెంచు తుందని అర్చకులు భక్తులకు వివరించారు. ఆ తర్వాత జరిగే మాంగళ్య పూజలో మంగళసూత్రంతో ముగ్గురు అమ్మవార్లను ఆవాహనం చేశారు. జనక మహారాజు, దశరథ మహారాజు తరుపున చేయించిన రెండు మంగళ సూత్రాలతోపాటు భక్తరామదాసు సీతమ్మకు చేయించిన మరొక మంగళసూత్రం కలిపి మూడు సూత్రాలతో మాంగళ్యధారణ చేశారు. స్వామివారికి పచ్చల పతకం, సీతమ్మకు చింతాకు పతకం, లక్ష్మణస్వామికి రామమాడలు అలంకరించి మదుపర్కం సమర్పించారు. వేడుకలు ఆద్యాంతం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో వీక్షించారు.

తలంబ్రాలు, పట్టువస్ర్తాలు సమర్పించిన
దేవాదాయ శాఖ మంత్రి...
రాష్ట్ర దేవాదాయ,ధర్మాదాయ, న్యాయ, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రభుత్వం తరుఫున పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ముందుగా రామాల యాన్ని దర్శించుకొని అక్కడ పూజలు అనంతరం కల్యాణ మండపానికి చేరుకున్నారు. కల్యాణాన్ని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు కనులారా తిల కించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం తరుఫున వ్యక్తిగతంగా సీతా రామచంద్రస్వామివారికి పట్టువస్ర్తాలు పంపించారు. దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ పట్టువస్ర్తాలు అందజేశారు. త్రిదండి చిన్నజీయర్‌స్వామి, తిరు మల తిరుపతి దేవస్థానం, శ్రీరంగక్షేత్రం, శృంగేరి పీఠం నుంచి స్వామివారికి పట్టువస్ర్తాలు, శేషమాలికలు, పవిత్రాలు పంపించారు. రామదాసు వంశం పదవ తరంగా ఉన్న కంచర్ల శ్రీనివాస్ దంపతులు స్వామివారికి పట్టువస్ర్తాలు అందజేశారు.

386
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles